Talliki Vandanam Misuse Case: కూటమి ప్రభుత్వం( Alliance government ) ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకం అమలు చేసింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ పథకంలో భాగస్వామ్యం చేసింది. పేద కుటుంబాలకు మేలు జరగాలన్న ఆలోచనతోనే ఈ పథకం అమలు చేసింది. అయితే ఈ పథకంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రకరకాల కారణాలతో చాలామంది తల్లులను అనర్హుల జాబితాలో చేర్చారు. మరికొన్ని జిల్లాల్లో జాబితాలో తప్పులు దొర్లాయి. ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో తల్లికి వందనం జాబితాలో తప్పులు బయటపడుతున్నాయి. అవే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. పలుచోట్ల ఒకే ఆధార్ తో పదులు, వందల సంఖ్యలో లబ్ధిదారులు ఉండడం గమనార్హం.
తప్పుడుగా రిజిస్ట్రేషన్
కర్నూలు జిల్లా( Kurnool district) హాల హర్వి లో ఉండే గాడి లింగప్ప అనే వ్యక్తికి ఏకంగా 94 మంది పిల్లలు ఉన్నట్లు రిజిస్టర్ అయింది. ఇతనికి రూ.12.22 లక్షల రూపాయలు జమ కానున్నట్లు మెసేజ్ వచ్చింది. మరోవైపు నంద్యాల జిల్లాలోని బెస్త సుజాత అనే మహిళకు 37 మంది పిల్లలు ఉన్నట్లు రిజిస్టర్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇతర తప్పులతో కూడిన జాబితాల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అర్హులు సైతం పథకం సొమ్మును పొందలేకపోతున్నారు. ప్రభుత్వం మంచి పథకం అమలు చేస్తున్న సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి.
Also Read: Talliki Vandanam Scheme: అర్హుల తుది జాబితా.. వారికే ‘తల్లికి వందనం’!
సోషల్ మీడియాలో హల్ చల్..
ప్రస్తుతం లింగప్ప సోషల్ మీడియాలో( social media) హల్చల్ చేస్తున్నాడు. తనకు 94 మంది పిల్లలు ఉన్నట్లు రిజిస్టర్ చేశారని.. తన పిల్లలు ఎవరో చూపించాలని డిమాండ్ చేశాడు. లేకుంటే ఆ నగదు అయిన జమ చేయాలని కోరుతున్నాడు. లింగప్ప కామెంట్స్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేస్తోంది. అయితే ఇప్పటికే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సచివాలయాల్లో గ్రీవెన్స్ సెల్ ను ప్రారంభించింది. ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఈనెల 21 నుంచి 28 వరకు పరిష్కార మార్గం చూపి.. మళ్లీ జాబితాలను రూపొందించనుంది. అయితే ఈ పథకం ద్వారా ప్రజలకు జరుగుతున్న మేలు కంటే.. క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలపై ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు.
తల్లికి వందనం.
తండ్రికి వందనం కాదు.
నా పేరు మీద 90 మంది పిల్లలు ఉన్నారని చూపించారు.
నాకు కూడా తెలియదు 90 మంది పిల్లలు ఉన్నారని. pic.twitter.com/HtoScgjIRT
— (@YSJ2024) June 19, 2025