https://oktelugu.com/

Boycott83: రణ్​వీర్​, దీపికలపై సుశాంత్​ అభిమానులు ఆగ్రహం.. ‘బాయ్​కాట్​ 83’ అంటూ ట్వీట్​

Boycott83: ఏక్ థా టైగర్,బజరంగీ భాయిజాన్, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కబీర్ ఖాన్ దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “83”. లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించగా ఆయన సతీమణి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కపిల్ దేవ్ భార్యగా నటించింది.  కిచ్చా సుదీప్​, జీవా, పంకజ్​ త్రిపాఠి, తదితరులు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 24, 2021 / 02:47 PM IST
    Follow us on

    Boycott83: ఏక్ థా టైగర్,బజరంగీ భాయిజాన్, వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన కబీర్ ఖాన్ దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం “83”. లెజెండరీ క్రికెటర్ టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో నటించగా ఆయన సతీమణి స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె కపిల్ దేవ్ భార్యగా నటించింది.  కిచ్చా సుదీప్​, జీవా, పంకజ్​ త్రిపాఠి, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు ఈ సినిమా విడుదలైంది.

    అయితే, ప్రస్తుతం ఈ సినిమాను బాయ్​కాట్​ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో స్లోగాన్స్ వినిపిస్తున్నాయి. దివంగత నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ అభిమానులు ఈ సినిమాను భహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే బాయ్​కాట్​ 83 హ్యాష్​ట్యాగ్​తో ట్విట్టర్​లో ట్రెండింగ్​ చేశారు. గతేడాది విడుదలైన చిప్స్ యాడ్​లో సుశాంత్​ను రణ్​వీర్​ ఎగతాలి చేశాడని రాజ్​పు అభిమానులు అతనిపై ట్రోల్స్ ప్రారంభించారు. ఇలా అనేక కారణాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

    ఈ సినిమా కచ్చితంగా ప్లాఫ్ అంటూ రణ్​వీర్​ సింగ్​, దీపికలపై వ్యతిరేకంగా పోస్ట్​లు చేస్తున్నారు.  జెన్​యూ విద్యార్థులకు సపోర్ట్​గా నిలిచినందుకు దీపికపైనా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక రణ్​వీర్​తో పాటు ఇతర బాలీవుడ్ తరాలు పాకిస్థాన్​కు  చెందిన ఐఎస్​ఐ ఏజెంట్లతో ఎలా పార్టీలు చేసుకుంటున్నారో చూడండంటూ.. పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. బాలీవుడ్​ను డ్రగ్గివుట్​ అంటూ కామెంట్లతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం హాట్​టాపిక్​గా మారింది.