
చిత్రం: డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు
నటీనటులు: అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్, సందీప్ భరద్వాజ్, రియాజ్ ఖాన్,సత్యం రాజేశ్, ప్రియదర్శి తదితరులు
సంగీతం: సిమన్ కె కింగ్
ఎడిటింగ్: తమ్మిరాజు
నిర్మాత: డాక్టర్ రవి ప్రసాద్‌రాజు దాట్ల
సినిమాటోగ్రఫీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.గుహన్
బ్యానర్: రమంత్ర క్రియేషన్స్;
విడుదల: సోనీ లివ్
ఓటీటీల హవా మొదలైనప్పటి నుంచి కాన్సెప్ట్ ఉన్న కథలతో చిత్రాలు రావడం మొదలవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు కథలను ప్రిపేర్ చేసి.. కొత్తగా దర్శకలు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు హాలీవుడ్‌కే పరిమితమైన స్క్రీన్‌ప్లై విభిన్న కథలు… ఇప్పుడు తెలుగులోనే రావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. కాగా, తాజాగా, ఆన్లైన్ కనెక్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం. ‘‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు).
కథేంటంటే:
విశ్వ(అదిత్ అరుణ్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఇతనికి అష్రఫ్(ప్రియదర్శి), క్రిస్టీ(దివ్య శ్రీపాద), సదా(సత్యం రాజేశ్) స్నేహితులు.. వాళ్లలతోనే కలిసి పనిచేస్తుంటాడు. ఒకరోజు విశ్వ సడెన్‌గా ఆన్‌లైన్‌లో ఉరివేసుకుంటూ కనిపిస్తాడు. అతడు చనిపోవాలనుకోవాలని అనుకోడానికి కారణం ఏంటి?. క్రిస్టీ రూమ్‌లో ఉండేందుకు వచ్చిన స్నేహితురాలు మిత్ర(శివానీ రాజశేఖర్)తో అతడి ప్రేమకథ ఎలా మొదలైంది?. విశ్వ నిజంగానే ఉరి వేసుకున్నాడా? ఈ సస్పెన్స్ తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
ఇటీవల కాలంలో పేపర్లు, టీవీల్లో తరచూ వినిపిస్తున్న మాట సైబర్ దాడులు. మన బ్యాంకు ఖాతాలు, సామాజి మాధ్యమాల్లో సమాచారంతో పాటు అనేక డేటాను కూర్చున్న చోటునుంచే తెలివితో సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి.. మనల్ని బెదిరిస్తూ.. డబ్బులు రాబట్టేందుకు పన్నాగాలు పన్నుతుంటారు.దీన్నే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు సినిమాలో చూపించాలనుకున్నారు. ఈ జోనర్లో గతంలోనే అనేక సినిమాలు వచ్చాయి. అయితే, ఈ కథ కాస్త భిన్నమనే చెప్పాలి. అయితే, డైరెక్టర్ గుహన్ తెరపై అనుకున్నది అనుకున్నట్లు చూపించడంలో తడబడినట్లు తెలుస్తోంది. సైబర్ క్రైమ్ అంటేనే అదో పెద్ద సబ్జెక్ట్. తవ్వే కొద్దీ సస్పెన్స్ తన్నుకుంటూ వస్తుంది. అయితే, గుహన్ మాత్రం, సింపుల్‌గా దీన్ని రివేంజ్ డ్రామాగా తెరకెక్కించారు. విశ్వ, క్రిస్టీ, అష్రఫ్, సదాలు ఏం చేస్తారన్న దానితో కథను మొదలు పెట్టి.. ఆ తర్వాత విశ్వ-మిత్రల ప్రేమ కథతో సన్నివేశాలను సాగదీశాడు. అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే పట్టింది.
కిస్టీ గతికి ఓ వ్యక్తి వచ్చి తనను కత్తితో పొడవడంతో సినిమా కీలక మలుపు తీసుకుంటుంది. అక్కడ నుంచే సినిమాలో ఆసలైన డ్రామా మొదలవుతుంది. మిత్రను కొట్టి బంధించిన తర్వాత.. ఏం జరుగుతుందన్న ఆసక్తి సినిమా చూస్తున్న ప్రేక్షకుల్లో కలుగుతుంది. అటువైపు నుంచి ఇదంతా ఆన్‌లైన్‌లో చూస్తున్న విశ్వ.. ఆమెను ఎలా కాపాడుతాడన్నదే కథ సాగుతుంది. అసలు ఆ వ్యక్తి ఎందుకు హత్య చేశాడు. అనేదే కథ మూలం. అయితే, అందుకు దర్శకుడు ఇచ్చిన కన్‌క్లూజన్ చాలా వీక్ అని చెప్పాలి. అతని ప్లాష్‌బ్యాక్‌లో అసలు ఎమోషన్ పండించలేకపోయాడు.
బలాలు
సెకండ్ పార్ట్, టెక్నికల్ బృందం పనితీరు.
బలహీనతలు
ఫస్ట్ ఆఫ్ లాగ్ కావడం, క్యారెక్టర్లు ఎమోషన్స్ పండించలేకపోవడం.