Sudigali Sudheer Remuneration: బుల్లితెర నటుడు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ ద్వారా తెరంగేట్రం చేసిన సుధీర్ ప్రస్తుతం బుల్లితెర మెగాస్టార్ గా మారాడు. తనదైన శైలిలో వ్యాఖ్యాతగా కూడా వెలుగు వెలుగుతున్నాడు. వండర్స్ వేణు ద్వారా జబర్దస్త్ లోకి వచ్చిన సుధీర్ అనతికాలంలోనే టీం లీడర్ గా ఎదిగాడు. అతడికి గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ తోడయ్యారు. దీంతో వారి అప్రతిహ విజయయాత్ర కొనసాగింది. వైవిధ్యమైన స్కిట్లతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో జబర్దస్త్ నుంచి సుధీర్ నిష్క్రమించినట్లు వార్తలు వస్తున్నాయి.

రస్తుతం సుడిగాలి సుధీర్ రెమ్యునరేషన్ గురించి చర్చ సాగుతోంది. అతడి పారితోషికం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతూ తన ప్రతిభతో ఉన్నత శిఖరాలు అందుకున్నాడు. జబర్దస్త్ లో వచ్చిన పారితోషికం కంటే ఇప్పుడు డబుల్ తీసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏ కార్యక్రమం అయినా సుధరీ్ ఉంటే చాలు అనే రేంజికి వెళ్లాడు. దీంతో వ్యాఖ్యాతగా సుధీర్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. సుధీర్ బుల్లితెర మెగాస్టార్ గా ఎదగడం విశేషం.
Also Read: Pavitra Lokesh: పవిత్ర లోకేష్ హోమ్లీ ఇమేజ్ డ్యామేజ్.. ఆ హోటల్ విజువల్సే కారణం
జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోల్లో కూడా సుధీర్ తన హవా కొనసాగించాడు. ఈ నేపథ్యంతో తన పారితోషికాన్ని పెంచుకుంటూ పోయాడు. దీంతో స్టార్ మా చానల్ సుధీర్ ను తీసుకునేందుకు ముందుకు రావడంతో మల్లెమాల భారీ ఆఫర్ ఇచ్చింది. ఒక దశలో పన్నెండు లక్షల పారితోషికం ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చినా సుధీర్ వినకుండా స్టార్ మా చానల్ కు వెళ్లాడు. దీంతో అక్కడ యాంకర్ అనసూయతో కలిసి సుధీర్ తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు.

అక్కడ సుధీర్ పారితోషికం అనసూయ కంటే ఎక్కువే. ఒక్కో ఈవెంట్ కు రూ. 15 లక్షల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సుధీర్ తన సంపాదనను అంతలా పెంచుకోవడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. సుధీర్ ఎదుగుదలకు రష్మీ కూడా కారణం అని చెబుతుంటారు. వీరిద్దరు ప్రేమికులుగా నటించి పలు షోల్లో ముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు. దీంతో సుధీర్ ప్రతిష్ట మరింత పెరిగింది. ఇప్పుడు స్టార్ మా లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు అనసూయ సంపాదన సుధీర్ కంటే
ఎక్కువ ఉండేది. ఇప్పుడు అనసూయ కంటే సుధీర్ పారితోషికమే ఎక్కువ ఉండటం గమనార్హం.
Also Read:Naresh and Pavitra Lokesh Issue: పవిత్ర నా భార్య.. నరేష్ కు షాకిచ్చిన ఆమె భర్త
[…] […]