Venigandla Ramu : అట్లాంటాలో విజయవంతమైన వెనిగండ్ల రాము ఆత్మీయ అభినందన సభ

ఈ ఆత్మీయ సభని విజయవంతం చేయటానికి సహకరించిన మురళి బొడ్డు, అనిల్ యలమంచిలి, మధుకర్ యార్లగడ్డ, వినయ్ మద్దినేని , భరత్ మద్దినేని మరియు మిత్రులందరికీ సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

Written By: NARESH, Updated On : August 29, 2024 8:16 pm

venigandla Ramu

Follow us on

Venigandla Ramu : అట్లాంటా వాసి , ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన వెనిగండ్ల రాము గారు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గుడివాడ నియోజక వర్గం నుండి తెలుగుదేశం , జనసేన, భా జా పా కూటమి అభ్యర్థిగా  చరిత్ర ఎరుగని అఖండ విజయం సాధించారు.  సుమారు 53 వేల పైచిలుకు మెజారిటీ తో గెలిచి మొదట సారిగా అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటా విచ్చేసిన సందర్భంగా ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ,ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రవాస ఆంధ్రులు , కూటమి మద్దతు దారులు అశేష సంఖ్యలో కలిసి స్థానిక సంక్త్రాంతి రెస్టారెంట్ బాంక్వెట్ హాల్ లో శ్రీనివాస్ నిమ్మగడ్డ గారి ఆధ్వర్యం లో ‘‘మన రాము సంబరాలు’’ పేరిట ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసారు .

Successful Venigandla Ramu Atmiya Abhinandana Sabha in Atlanta

వందల కార్ల తో ర్యాలీ గా రాము వెనిగండ్ల గారిని సమావేశ మందిరానికి తీసుకు రాగా , తెలుగింటి ఆడపడుచులు ఘన స్వాగతం పలకగా వారికీ తోడుగా కూటమి అభిమానులు డప్పు మేళాలతో సభా ప్రాంగణం అంతా అత్యంత కోలాహలంగా కలియ తిరిగారు

తెలుగుదేశ వ్యవస్థాపక అధ్యక్షులు , ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి , శ్రీ రాము వెనిగండ్ల గారు వారి శ్రీమతి సుఖద వెనిగండ్ల గారు, అట్లాంటా నాయకులు శ్రీనివాస్ లావు , అంజయ్య చౌదరి లావు , మల్లిక్ మేదరమెట్ల , సతీష్ ముసునూరి, సురేష్ ధూళిపూడి గారు వేదికను అలంకరించారు

Successful Venigandla Ramu Atmiya Abhinandana Sabha in Atlanta

తానా తాజా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు , ఎన్నారై అట్లాంటా టి డి పి నాయకులు శ్రీనివాస్ లావు , మల్లిక్ మేదరమెట్ల , సతీష్ ముసునూరి. ఎన్నారై అట్లాంటా జనసేన నాయకులు సురేష్ ధూళిపూడి , సురేష్ కరోతు మరియు భా జా పా అట్లాంటా నాయకులు కార్తికేయ బండారు విచ్చేసిన అతిథుల్ని ఉద్దేశించి ప్రసంగించారు . ఈ కార్యక్రమానికి సురేష్ పెద్ది మరియు సుజాత ఆలోకం వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. గత నాలుగు పర్యాయాలు గా ఎటువంటి అభివృద్ధి కి నోచుకోని గుడివాడ వాసుల కష్టాలను ప్రత్యక్షంగా చూశానని తన అనుభవాలని సభికులకు శ్రీమతి సుఖద వెనిగండ్ల గారు వివరించి ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్ధి కి మరీ మఖ్యంగా గుడివాడ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు .

ఆత్మీయ సత్కార గ్రహీత గుడివాడ శాసనసభ్యులు రాము వెనిగండ్ల గారు మాట్లాడుతూ గుడివాడ పుట్టిన ప్రదేశం కాగా తన ఉన్నతికి ఎంతో కారణమైన అట్లాంటా కూడా తనకి పుట్టిన ఊరుతో సమానం అని మీ అందరి ప్రేమ అభిమానాలు వెలకట్టలేనివి అని చెప్పారు. తన పుట్టిన గుడివాడలో వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న కూడా ఇప్పుడు శాసన సభ్యుడిగా తనకి అవకాశం ఇచ్చిన తెలుగుదేశ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇతర కూటమి నాయకులకి ధన్యవాదములు తెలిపారు, తన గెలుపుకి అట్లాంటా మిత్రులు వెన్నుదన్నుగా నిలిచి ఎంతో వ్యయ ప్రయాసలతో గుడివాడ వరకు వచ్చి నైతిక మద్దతు తెలిపిన అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు, ఈ గెలుపు ద్వారానా తన బాధ్యత మరింత పెరిగింది అని ఇప్పటివరకు కనీస సౌకర్యాలకు కి కూడా గుడివాడ ప్రజలు నోచుకోలేదు అని ప్రజల అవసరాలని గాలికి వదిలేసి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రం గా మార్చివేశారని అడిగితే బూతులతో సమాధానం , అణచురలతో దౌర్జన్యం చేయటం తో ప్రజలు విసిగి పోయి కూటమి అభ్యర్థి ఐన నన్ను గుడివాడ చరిత్ర లో భారీ మెజారిటీ తో గెలిపించారు అని వారి రుణం ఈ జీవితం లో తీర్చుకోలేను అని..వారి నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా గుడివాడ గడ్డ అభివృద్ధి అడ్డా గా మారుస్తా అని దానికి నా శక్తీ తో పాటు మీ సహకారం కూడా కావాలి అని సభికులని కోరారు. ఎప్పటి లాగ గుడివాడ ప్రజలతో పటు ఇక్కడ వారికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో వుంటా అని ఎటువంటి కార్యక్రమాలు చెయ్యాలన్న, సహాయం కావాలి అన్నా మీ రాము ఎప్పుడు ఫోన్ లో అందుబాటులోనే వుంటా అని అందరం కలిసికట్టు మన మాతృభూమి అభివృద్ధి కి కృషి చెయ్యాలని కోరారు.

Successful Venigandla Ramu Atmiya Abhinandana Sabha in Atlanta

అట్లాంటా నాయకులు మాట్లాడతూ మనలో ఒకరు ఐన రాము గారు …ప్రజా సేవకి ముందుకు రావటం , తెలుగుదేశ పార్టీ అవకాశం ఇవ్వటం అక్కడ ప్రజలు రాము గారిని అత్యంత మెజారిటీ తో గెలిపించటం మన అట్లాంటా వాసులకి ఎంతో గర్వకారణంగా వుంది అని …రాము గారు గెలిచాక ప్రపంచ నలుమూలల వున్నా పరిచయస్తులు, అభిమానులు ఫోన్ చేసి రాము గారు అట్లాంటా వాసి అంట కదా అని ఎంక్వైరీ చేస్తుంటే ఆ అనుభూతి వర్ణించలేము అని తెలిపారు అలాగే రాము గారికి తమ సహాయ సహకారాలు అన్ని వేళలా ఉంటాయి అని..రాష్ట్ర అభివృద్ధి లో మేము కూడా పాలుపంచుకుంటామని తెలిపారు.

చివరిగా వ్యాఖ్యాతలు , సభికులు అడిగిన పలు ప్రశ్నలకి వెనిగండ్ల రాము దంపతులు ఎంతో విపులంగా ఎటువంటి అమరికలు లేకుండా సమాధానాలు చెప్పటం వచ్చిన అతిథుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి.

ఈ ఆత్మీయ సభని విజయవంతం చేయటానికి సహకరించిన మురళి బొడ్డు, అనిల్ యలమంచిలి, మధుకర్ యార్లగడ్డ, వినయ్ మద్దినేని , భరత్ మద్దినేని మరియు మిత్రులందరికీ సంక్రాంతి రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్ నిమ్మగడ్డ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు