Vidamuyarchi Movie : పద్మభూషణ్ పురస్కారం అందిన తర్వాత తమిళ హీరో అజిత్ నుండి విడుదల అవుతున్న చిత్రం ‘విడాముయార్చి’. సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులను తొలగించుకొని ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తెలుగు లో ఈ చిత్రం ‘పట్టుదల’ అనే పేరుతో విడుదల అవుతుంది. చాలా కాలం తర్వాత అజిత్ నుండి విడుదల అవుతున్న సినిమా కావడంతో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతున్నాయి. చెన్నై సిటీ లో 700 కు పైగా షోస్ ని షెడ్యూల్ చేస్తే, అన్ని షోస్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ఇంకా 200 షోస్ షెడ్యూల్ చేయాల్సి ఉంది, అది కూడా చేస్తే మొదటిరోజు తమిళనాడు లో ఆల్ టైం రికార్డుని నెలకొల్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ సినిమాకి కేవలం తమిళనాడు నుండే 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రాత్రి సమయానికి 18 కోట్లు దాటొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 40 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయని అంటున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తే, ఈ చిత్రానికి మొదటి రోజే వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘బ్రేక్ డౌన్’ అనే చిత్రాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని తమిళం కంటే ముందుగా తెలుగు లోనే చేయాలనుకున్నారు. ఒక ప్రముఖ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ని హీరో గా పెట్టి ఈ యాక్షన్ మూవీ తీయాలనుకున్నారు. వెంకటేష్ కూడా అందుకు సుముఖంగానే ఉన్నప్పటికీ, అప్పటికే ఈ సినిమాని అజిత్ చేస్తున్నాడనే విషయం తెలుసుకొని డ్రాప్ అయ్యారు.
ఒకవేళ వెంకటేష్ ఈ సినిమా చేసుంటే తెలుగు లో కమర్షియల్ హిట్ అయ్యేదేమో కానీ, ఒక మంచి యాక్షన్ సినిమాని చూసిన అనుభూతి కలుగుతుంది అని చెప్పొచ్చు. గతం లో వెంకటేష్ ‘ఘర్షణ’ చిత్రం కూడా ఈ జానర్ మీద తెరకెక్కిన సినిమానే. చాలా ఇంటెన్స్ గా ఆ చిత్రం ఉంటుంది. ఇక ‘విడాముయార్చి’ చిత్రం విషయానికి వస్తే, ఈ సినిమాకి మజిగ్ తిరుమనేని దర్శకత్వం వహించగా, అనిరుద్ సంగీతం అందించాడు. త్రిష హీరోయిన్ గా నటించగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా కాసాండ్రా విలన్స్ గా నటించారు. ట్రైలర్ ని చూస్తున్నంతసేపు ఒక హాలీవుడ్ యాక్షన్ చిత్రాన్ని చూసిన ఫీలింగ్ వచ్చింది. సినిమా మొత్తం ఆరంభం నుండి క్లైమాక్స్ వరకు మంచి థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుందని బలమైన నమ్మకం తో చెప్తుంది మూవీ టీం.