YS Jagan Mohan Reddy : ఇప్పటివరకు ఒక ఎత్తు ఇకనుంచి మరో ఎత్తు అంటున్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy). కార్యకర్తల కోసం తాను మారతానని చెప్పుకొచ్చారు. తనలో ఫస్ట్ వెర్షన్ ప్రజల కోసం పనిచేసిందని.. రెండో వెర్షన్ మాత్రం కార్యకర్తల కోసమేనని తేల్చి చెప్పారు. ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్మోహన్ రెడ్డి. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 2029లో అధికారానికి రాబోతున్నామని ప్రకటించారు. మరో 30 సంవత్సరాలు పాటు ఈ రాష్ట్రంలో అధికారం చేపడతామని కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సినిమా డైలాగులు చెబుతూ పార్టీ శ్రేణులకు ఆనందం ఇచ్చారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది.
* ముఖ్య నేతలతో భేటీ
ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అటు నుంచి అటే బెంగళూరులో( Bangalore) నాలుగు రోజులు పాటు ఉన్నారు. నిన్ననే తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. పార్టీ ముఖ్యులతో సమావేశం అయ్యారు. తన జిల్లాల పర్యటనకు సంబంధించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఉగాది తర్వాత తన జిల్లాల పర్యటన ఉంటుందని తేల్చి చెప్పారు. ఇంతలో ప్రతి జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతానని చెప్పుకొచ్చారు. ప్రజల మధ్య ఉంటూ వారితో మమేకం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి.
* విజయవాడ కార్పొరేషన్ పై ఫోకస్
ఇంకోవైపు విజయవాడ కార్పొరేషన్ పై( Vijayawada Corporation) కూటమి దృష్టి పెట్టింది. గత రెండు రోజులుగా జరిగిన కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో కూటమి హవా చాటింది. ఇటువంటి తరుణంలో కీలకమైన విజయవాడ కార్పొరేషన్ పై టిడిపి జెండా ఎగురువేయాలని భావిస్తోంది. ఎన్నికలకు ముందు.. తరువాత చాలామంది కార్పొరేటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. దీంతో ఎలాగైనా విజయవాడ కార్పొరేషన్ ను తమ ఖాతాలో వేసుకోవాలని టిడిపి భావిస్తోంది. ఈ తరుణంలోనే జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. సినిమా డైలాగులతో అలరించారు.
* రోబో డైలాగులతో
సూపర్ స్టార్ రజనీకాంత్ ( Rajinikanth )నటించిన రోబో, రోబో 2.0 సినిమాలు ఎంతగానో హిట్ అయ్యాయి. ప్రేక్షక ఆదరణ పొందాయి. ఆ సినిమాతో పోల్చుతూ జగన్మోహన్ రెడ్డి డైలాగులు చెప్పారు. జగన్ 1.0 ప్రజల కోసమని.. 2.0 కార్యకర్తల కోసమని తేల్చి చెప్పారు. అంతులేని మెజారిటీ ఇచ్చిన ప్రజలకు మేలు చేసే క్రమంలో కార్యకర్తలను పట్టించుకోలేదని ఒప్పుకున్నారు. ఇకనుంచి 2.0 చూస్తారని.. జగన్ అంటే కార్యకర్తలకు ఎంత ఇష్టమో చూస్తారని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులు ఫిదా అవుతున్నాయి.