https://oktelugu.com/

Rajamouli-Mahesh Movie : మగధీర లో శ్రీహరి, బాహుబలి లో సత్య రాజ్, మరి రాజమౌళి మహేష్ తో చేసే మూవీలో అలాంటి పాత్ర పోషించే నటుడు ఎవరు..?

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు అందులో రాజమౌళి మొదటి స్థానం ఉంటాడు...అందుకే ఆయన లాంటి సినిమాలను తీయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తు ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 14, 2024 / 01:33 PM IST

    Rajamouli-Mahesh Movie 

    Follow us on

    Rajamouli-Mahesh Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు రాజమౌళి.. ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో భారీ గ్రాఫిక్స్ ని వాడుతూ సూపర్ సక్సెస్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇండియాలో ఉన్న స్టార్ యాక్టర్స్ అందరూ ఈ సినిమాలో నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక గ్రే క్యారెక్టర్ అయితే ఉంటుంది. ఆ క్యారెక్టర్ హీరోతో పాటు సమానమైన గుర్తింపు సంపాదించుకుంటూ ఉంటుంది. నిజానికి బాహుబలి సినిమాలో కట్టప్ప లాగా, మగధీర సినిమాలో శ్రీహరి లాగా రాజమౌళి తన సినిమాల్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ను హీరోతో పాటు సమానంగా డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. మరి ఈ సినిమాలో కూడా అలాంటి ఒక పాత్ర అయితే ఉందట.

    మరి ఆ పాత్రని ఎవరు పోషిస్తున్నారనే విషయంలోనే ఇప్పుడు చాలా వరకు కన్ఫ్యూజన్స్ అయితే వస్తున్నాయి. మరి రాజమౌళి ఈ క్యారెక్టర్ లో తెలుగు హీరోని తీసుకుంటాడా లేదంటే హాలీవుడ్ నుంచి ఎవరైనా హీరోని తీసుకొస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మరి మొత్తానికైతే రాజమౌళి చేస్తున్నా ఈ భారీ ప్రయోగంలో ఇండియన్ జనాలందరూ భాగమై అతన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.

    ఎందుకంటే ప్రపంచ పటంలో ఇప్పుడు తెలుగు సినిమాని అలాగే ఇండియన్ సినిమా స్టాండర్డ్ ని చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన మరింత ముందుకెళ్లే విధంగా అందరూ ఎంకరేజ్ చేయాలి. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని తొందర్లోనే రిలీజ్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది.

    ఇక ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన మొత్తం ప్రణాళికలను రూపొందించి పెట్టుకున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికైతే పాన్ వరల్డ్ లెవెల్లోకి మన తెలుగు సినిమా దర్శకుడు వెళ్ళాడు అని చెప్పుకోవడంలో మాత్రం మనందరం గర్వపడాల్సిన విషయమనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన సాధించే విజయాలు ఎలా ఉంటాయి అనేది తెలియాలంటే మనం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…