Sonia Gandhi’s retirement : 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ చనిపోయిన 90వ దశకం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ బండిని నడిపించింది. అయితే ఇక నడిపించే ఓపిక శక్తి, సహనం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీలో లోపించాయి. వ్యాధులు చుట్టుముట్టాయి. కొడుకు రాహుల్ గాంధీ తల్లి నుంచి బాధ్యతలను సరిగ్గా అందిపుచ్చుకోలేక ఆపసోపాలు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇక కాంగ్రెస్ ను నడపడం తన వల్ల కాదంటూ సోనియాగాంధీ కాడి వదిలేసింది.
కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ తాజాగా సంచలన ప్రకటన చేశారు. క్రియాశీలక రాజకీయాలకు ఇక నేను దూరం అంటూ ప్రకటించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.
చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ 85వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు సోనియాగాంధీ రాజకీయ సన్యాసం ప్రకటన చేశారు. భారత్ జోడో యాత్ర తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
10యేళ్ళ యూపిఏ ప్రభుత్వం నాకు సంతోషం కల్గించిన అంశమని.. భారత్ జోడో యాత్ర తరువాత తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగించటం సంతోషం అని తెలిపారు.
కాంగ్రెస్ కు, దేశానికి కూడా 2024 ఎన్నికలు పరీక్షలాంటివి అని సోనియా అన్నారు. ఏపి కి ప్రత్యేక హోదా పై మేము కట్టు బడి ఉన్నామని ప్రకటించారు. రాయ్పూర్ లో జరుగుతున్న ఏఐసిసి ప్లీనరి సందర్భంగా సోనియా రిటైర్మెంట్ ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సోనియా ప్రకటన చూస్తే జోడోయాత్రతో రాహుల్ సంపూర్ణ నాయకుడిగా ఎదిగాడని ఆమె భావిస్తోంది. అందుకే ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకొని కొడుకుపై భారం వేసినట్టుగా అర్థమవుతోంది. మరి కాంగ్రెస్ పగ్గాలను రాహుల్ అందిపుచ్చుకుంటాడా? 2024 ఎన్నికల్లో దేశంలో అధికారంలోకి తీసుకొస్తాడా? అన్నది వేచిచూడాలి.