
Phone Side Effects: ఇటీవల కాలంలో ఫోన్ వాడకం పెరిగిపోతోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఫోన్ లేనిదే ఉండటం లేదు. దీంతో చాలా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అయినా లెక్కచేయడం లేదు. గంటల పాటు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. కానీ విరామం లేకుండా ఫోన్లతోనే ఉంటున్నారు. పలు దుష్ర్పభావాలకు కేంద్రంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియా గ్రూపుల్లో యాక్టివ్ గా మారిపోతున్నారు. ఫలితంగా ఎన్నో బాధలకు గురవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ఓ మహిళ ఎక్కువ సమయం రాత్రుళ్లు ఫోన్ వాడకంతో చూపు సమస్య ఎదుర్కొంది.
ఫోన్ ఎక్కువగా వాడితే..
ఫోన్ ఎక్కువగా వాడితే తలనొప్పి, మైకం కళ్లు తిరగడం లాంటి లక్షణాలు వేధిస్తాయి. ఈ నేపథ్యంలో సరిగా నడవలేక బెడ్ కే పరిమితమైన వారు కూడా ఉన్నారు. నెలల పాటు బాధను అనుభవిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్నో నష్టాలు సంభవిస్తున్నా నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ సమయం తెలియకుండా గడుపుతున్నారు. కొందరైతే తినడానికి కూడా సమయం కేటాయించడం లేదంటే ఫోన్లకు ఎంతగా ఆకర్షితులయ్యారో తెలుస్తోంది.
అమెరికాలో..
తాజాగా అమెరికాకు చెందిన ఫెనెల్లా ఫాక్స్ వర్టిగో వ్యాధికి గురైంది. ఈ వ్యాధి వచ్చిన వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆమె రోజుకు 14 గంటల పాటు ఫోన్ వాడటం వల్ల నడుము పనిచేయకుండా పోయింది. వీల్ చైర్ కే పరిమితమైంది. బెడ్ మీదే పడుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫోన్ వాడకం ఎంత దిగజార్చిందో తెలుస్తూనే ఉంది కదా. అయినా ఎవరు కూడా ఇలాంటి ఘటనల గురించి తెలుసుకుంటున్నా వారి వైఖరి మార్చుకోవడం లేదు. ఫలితంగా పలు సమస్యలకు దగ్గరవుతున్నారు.

ఐ ప్యాడ్లతో అవస్థలే..
ఐ ప్యాడ్, ఐ ఫోన్లతో అందరు చేతిలో మొబైల్ తోనే గడుపుతున్నారు. దీని వల్ల ఎంతో మంది బాధితులు అవుతున్నారు. ఫోన్ వల్లే సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. రకరకాల వ్యాధులకు చేరువ అవుతున్నారు. చూపు మందగిస్తోంది. నడుము పడిపోతోంది. బెడ్ కే పరిమితమవుతున్నా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఫోన్ల వాడకం తగ్గించుకునేందుకు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అందుకే పలు రకాల జబ్బులకు దగ్గరవుతున్నా నిర్లక్ష్యంతోనే ఉంటున్నారు. భవిష్యత్ లో మరిన్ని సమస్యలకు కారణంగా నిలుస్తున్నారు.