https://oktelugu.com/

Sleep: నిద్ర రాకుండానే పడుకోవడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

కొందరు నిద్ర వచ్చినప్పుడే బెడ్‌రూమ్‌కి వెళ్లి నిద్రపోతారు. కానీ మరికొందరు మాత్రం నిద్ర రాకపోయిన కూడా లైట్స్ ఆఫ్ చేసి పడుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్త నిద్ర వచ్చినట్లు అనిపిస్తే నిద్రపోవచ్చు. కానీ పూర్తిగా నిద్ర రాకుండా పడుకోవడం వల్ల ఒత్తిడి బాగా పెరిగి ఇంకా నిద్ర రావడం ఆలస్యం అవుతుందని నిపుణులు అంటున్నారు.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 1, 2024 / 10:10 PM IST

    sleep

    Follow us on

    Sleep: ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్‌ లేదా మారిన జీవనశైలి వల్ల చాలామంది సరిగ్గా నిద్రపోవడం లేదు. మనిషికి తిండి, నీరు ఎంత ముఖ్యమూ నిద్ర కూడా అంతే ముఖ్యం. తిండి లేకపోయిన కొన్ని రోజులు బ్రతకగలరు ఏమో.. కానీ నిద్ర లేకపోతే బ్రతకలేరు. ఒక్క రోజు నిద్ర తక్కువైన మనిషి చాలా నీరసంగా అయిపోతారు. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈ రోజుల్లో అయితే ఎక్కువగా సోషల్ మీడియాకు బానిస అయ్యి.. పగలు, రాత్రి తేడా లేకుండా వాడుతున్నారు. మొబైల్ నుంచి వచ్చే ఆ కిరణాల వల్ల తొందరగా నిద్ర పట్టదు. దీనివల్ల చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మనిషికి నిద్ర లేకపోతే నీరసంగా అయిపోయి.. ఏ పని కూడా సరిగ్గా చేయలేరు. రోజంతా చిరాకుగా, నీరసంగా ఉంటుంది. అయితే కొందరు నిద్ర వచ్చినప్పుడే బెడ్‌రూమ్‌కి వెళ్లి నిద్రపోతారు. కానీ మరికొందరు మాత్రం నిద్ర రాకపోయిన కూడా లైట్స్ ఆఫ్ చేసి పడుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్త నిద్ర వచ్చినట్లు అనిపిస్తే నిద్రపోవచ్చు. కానీ పూర్తిగా నిద్ర రాకుండా పడుకోవడం వల్ల ఒత్తిడి బాగా పెరిగి ఇంకా నిద్ర రావడం ఆలస్యం అవుతుందని నిపుణులు అంటున్నారు.

    చాలా మంది నిద్రపోయే ముందు మొబైల్ చూడటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వచ్చిన నిద్ర కూడా వెళ్లిపోతుంది. కాబట్టి నిద్రపోయే ముందు పుస్తకాలు చదవడం, పేపర్ చదవడం, చెస్ వంటి గేమ్స్ ఆడటం మంచిదని నిపుణులు అంటున్నారు. నిద్రపోయే రెండు గంటల ముందు వరకు ఎలాంటి రేడియేషన్ కళ్లపై పడకుండా చూసుకోవాలి. అలాగే నిద్ర వచ్చే సమయంలో గదిలో ఎలాంటి వెలుతురు ఉండకుండా చూసుకోండి. దీనివల్ల నిద్ర కూడా హాయిగా పడుతుంది. కొందరు సమయం సందర్భం లేకుండా టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. నిద్ర సమస్యలు ఉన్నవారు సాయంత్రం 4 గంటల తర్వాత టీ, కాఫీలు తాగకుండా ఉండండి. దీనివల్ల నిద్రలో ఎలాంటి సమస్య ఉండదు. నిద్రపోయే ముందు కళ్లు మూసుకుని లోతుగా శ్వాస తీసుకోవాలి. ఏం ఆలోచించకుండా నిద్రపోయే ముందు మనస్సును ఇలా ఉంచితే మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో మీకు నిద్ర కూడా తొందరగా పడుతుంది.

    రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే డిన్నర్ తొందరగా చేయాలి. కొందరు ఆలస్యంగా డిన్నర్ చేస్తుంటారు. దీనివల్ల నిద్రకు ఆటంకం కలుగుతుంది. అలాగే నిద్రపోయే ముందు స్నానం చేయడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా వేడి నీరు స్నానం చేయడం అలవాటు చేసుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన సమయానికి నిద్రపట్టాలంటే తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ ఉదయం లేదా సాయంత్రం పూట వ్యాయామం చేయడం వల్ల బాడీ బాగా అలసిపోతుంది. ఇలా అలసిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రిపూట బాగా నిద్రపడుతుంది. బాడీకి శారీరక శ్రమ లేకపోతే రాత్రిపూట నిద్ర పట్టడం చాలా కష్టం.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.