https://oktelugu.com/

Jio Network : దేశవ్యాప్తంగా జియో సేవలు బంద్.. యూజర్ల గగ్గోలు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

దేశంలోనే అతిపెద్ద టెలికాం సర్వీస్ ఆపరేటర్ గా జియో కొనసాగుతోంది. కోట్లాదిమంది కస్టమర్లతో అలారారుతోంది. టారిఫ్ చార్జీలు పెంచడంతో కొంతమేర కస్టమర్లను కోల్పోయినప్పటికీ.. భారతి ఎయిర్ టెల్ కు బలమైన సవాల్ విసురుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 1, 2024 / 10:08 PM IST

    Jio Network

    Follow us on

    Jio Network :  దేశంలో నెంబర్ వన్ నెట్ వర్క్ గా రిలయన్స్ జియో కొనసాగుతోంది. దీనిని తన మానస పుత్రికగా ముకేశ్ అంబానీ పలు వేదికల వద్ద అభివర్ణించారు. దీన్ని ప్రారంభించిన అనతి కాలంలోనే నెంబర్ వన్ నెట్వర్క్ గా అవతరించింది. ప్రారంభంలో బంపర్ ఆఫర్లు ప్రకటించిన ముఖేష్ అంబానీ.. ఆ తర్వాత వాటిని తొలగించడం మొదలుపెట్టారు. మొత్తంగా మొదట్లో ఉచితంగా ఇచ్చిన సేవలను మొత్తం నిలుపుదల చేశారు. దీంతో గత్యంతరం లేక.. ఇతర నెట్వర్క్ ల వైపు వెళ్లడానికి మనసు ఒప్పక వినియోగదారులు జియోనే కొనసాగిస్తున్నారు. అయితే ఈ జియో సేవల్లో గత కొంతకాలంగా తరచూ అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నట్టుండి సిగ్నల్ పడిపోతుంది. ఫోన్ కాల్ చేస్తే కనెక్ట్ కావడం లేదు. ఒకవేళ కనెక్ట్ అయినా వాయిస్ సరిగా వినిపించడం లేదు. ఇంటర్నెట్ సేవలో తరచూ అంతరాయం చోటు చేసుకుంటున్నది. దీంతో యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాగా, ఇటీవల జియో టారిఫ్ ధరలను విపరీతంగా పెంచింది. దీంతో కొంతమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు వెళ్లిపోయారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో బ్యాన్ జియో ఉద్యమం కూడా నడిచింది. అయినప్పటికీ రిలయన్స్ యాజమాన్యం ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కస్టమర్లు ఇతర నెట్వర్క్ ల వైపు వెళుతున్నప్పటికీ.. జియో తన టారిఫ్ ధరలను ఏమాత్రం తగ్గించలేదు.

    దారుణమైన నెట్వర్క్

    ఇక ఆదివారం దేశవ్యాప్తంగా జియో సేవలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే గంటలు తరబడి సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీంతో యూజర్లు నరకం చూస్తున్నారు. జియో సేవలు స్తంభించి పోవడం వెనుక సాంకేతిక కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది వేసవికాలంలో ఇలాగే జియో సేవలు నిలిచిపోయాయి. దీంతో యాజమాన్యం రంగంలోకి దిగి సాంకేతిక సమస్యను పరిష్కరించింది. ఫలితంగా సేవలను పునరుద్ధరించింది. ఇప్పుడు కూడా అలాంటి సమస్యలే ఏర్పడి ఫోన్ కాల్స్ కరెక్ట్ కావడం లేదని, ఇంటర్నెట్ రావడం లేదని యూజర్లు వాపోతున్నారు. జియో యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. అయితే కొంతమంది మాత్రం ప్రస్తుతం ఏర్పడిన తుఫాన్ వల్ల ఈ అంతరాయం కలిగి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరేమో యూజర్ల పై రిలయన్స్ మరింత ధరల భారాన్ని మోపనుందని.. దానికి శాంపిల్ గా ఇలా సేవలను స్తంభింప చేస్తోందని పేర్కొంటున్నారు. అయితే దేశ వ్యాప్తంగా సేవలు నుంచి పోవడంతో ఇంతవరకు జియో యాజమాన్యం స్పందించలేదు. అయితే ఈ సమస్యను సాధారణంగా వచ్చే టెక్నికల్ ఇష్యూ అని మేనేజ్మెంట్ భావిస్తోంది. వెంటనే సిగ్నల్స్ పునరుద్ధరణ జరుగుతుందని వ్యాఖ్యానిస్తోంది.. అసలే దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. జియో నెట్వర్క్ ఇలా డౌన్ కావడం యూజర్లకు చికాకు కలిగిస్తోంది. ఇలా నెట్వర్క్ డౌన్ కావడం వల్ల భారీగా నష్టం ఏర్పడుతుందని యూజర్లు వాపోతున్నారు.