SKN Comments On Rajasaab: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Teaser) డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా నేడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ టీజర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ చివరి సారిగా పూర్తి స్థాయిలో కామెడీ చేసిన చిత్రం ‘బుజ్జిగాడు..మెడ్ ఇన్ చెన్నై’. అదే విధంగా ఆయన పూర్తి స్థాయి కమర్షియల్ జానర్ లో కనిపించిన చిత్రం ‘మిర్చి’. అప్పటి ప్రభాస్ ని బాగా మిస్ అవుతున్న అభిమానులకు ఈ సినిమా ఒక ట్రీట్ లాంటిది అని టీజర్ తోనే చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ మారుతీ. ఇకపోతే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత SKN మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: Producer SKN: చిరంజీవి ముందర .. జీవిత రాజశేఖర్, రోజా కి చురకలు వేసిన బేబీ నిర్మాత
ఆయన మాట్లాడుతూ ‘ఇది మూవీ లాంచ్ కాదు..ట్రైలర్ లాంచ్ కాదు..కేవలం ఒక టీజర్ లాంచ్. దీనికే మీరంతా ఇంత రచ్చ చేశారంటే, డిసెంబర్ 5న సినిమా విడుదలకు ఇక ఏ రేంజ్ రచ్చ చేస్తారో ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఈ పేరుని గుర్తు పెట్టుకోండి. సినిమా విడుదల తర్వాత అందులోని విజువల్ ఎఫెక్ట్స్ కి మీరు ఆయన ఫ్యాన్స్ అయిపోతారు. అంత భారీగా VFX కోసం ఆయన ఖర్చు చేసాడు. ఇక డైరెక్టర్ మారుతీ గురించి మాట్లాడుకోవాలి. బందరులో కృష్ణ కిషోర్ థియేటర్, ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ని చేశారు, అప్పట్లో ఈ థియేటర్ ముందు మారుతీ తండ్రి అరటిపండ్లు అమ్ముకునేవాడు. చిన్నతనం లో వచ్చిన కష్టాలను చూసి మారుతీ గారు తనకు ఎంతో ఇష్టమైన సినీ రంగం లోకి అడుగుపెట్టి పెద్ద రేంజ్ కి వెళ్లాలని ఒక కల కన్నాడు’.
‘దాని కోసం ఆయన 23 ఏళ్ళ పాటు కష్టపడి నేడు పాన్ ఇండియన్ స్టార్ పక్కన తన కటౌట్ కూడా పడే రేంజ్ కి ఎదిగాడు. ఒక భర్త బలమేంటో భార్య మాత్రమే చెప్తుంది. అదే విధంగా ఒక స్నేహితుడి పొటెన్షియల్ ఏంటో అతని ప్రాణ స్నేహితుడు మాత్రమే చెప్పగలడు. 20 ఏళ్లుగా మారుతీ తో స్నేహం చేసిన వాడిగా చెప్తున్నాను, రాసి పెట్టుకుంది, డిసెంబర్ 5 న ఈ సినిమాని ఎవరైతే తక్కువ అంచనా వేసారో, వాళ్లకు ఈ చిత్రం పెట్టె రికార్డ్స్ ని చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. అదే విధంగా ఒక నిర్మాత పని గట్టుకొని ఈ చిత్రం పై నెగటివ్ క్యాంపైన్ చేసాడు. ఆయన చేతనే పాజిటివ్ క్యాంపైన్ చేసేలా చేస్తాం’ అంటూ SKN మాట్లాడిన మాటలు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో మీరే ఈ క్రింది వీడియోలో చూడండి.