Producer SKN: చిరంజీవి ముందర .. జీవిత రాజశేఖర్, రోజా కి చురకలు వేసిన బేబీ నిర్మాత

‘బాస్ అంటే మంచితనం. ఎందుకంటే.. బాస్‌ను విమర్శించిన వాళ్లు ఒక మూడు నెలల తరవాత వచ్చి బాస్ దగ్గర ఒక హెల్ప్ తీసుకుంటారు, బొకే ఇచ్చి ఆయనతో ఫొటో తీసుకుంటారు. వాళ్లను ఆయన ఏమీ అనరు.

Written By: Swathi, Updated On : August 1, 2023 8:48 pm

Producer SKN

Follow us on

Producer SKN: తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానించేవారు ఎంతమంది ఉన్నారో, విమర్శించే వారు కూడా అంతే మంది ఉన్నారు. అయినని అభిమానించే వారే కాదు, అమితంగా ద్వేషించే వారు కూడా ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే రోజా కి అలానే జీవితా రాజశేఖర్ లకు చిరంజీవి అంటే అస్సలు పడదు అనేది ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న సంగతి. ఇదే విషయం పలుమార్లు పలు సందర్భాలలో కూడా రుజువు అయింది.

ఇక రోజా ని జీవిత రాజశేఖర్ ని అభిమానించేవారు చిరంజీవి పైన విమర్శలు కురిపిస్తే, చిరంజీవిని అభిమానించేవారు, వారి పైన విమర్శలు కురిపించడం సహజమైపోయింది. ఇక ఇలాంటి సంఘటనే ఈమధ్య బేబీ మెగా ఈవెంట్ లో కూడా జరిగింది. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా ఈమధ్య సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అభినందించడానికి మెగా ఈవెంట్ కి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవికి వీరాభిమానైనా బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

‘బాస్ అంటే మంచితనం. ఎందుకంటే.. బాస్‌ను విమర్శించిన వాళ్లు ఒక మూడు నెలల తరవాత వచ్చి బాస్ దగ్గర ఒక హెల్ప్ తీసుకుంటారు, బొకే ఇచ్చి ఆయనతో ఫొటో తీసుకుంటారు. వాళ్లను ఆయన ఏమీ అనరు. మంచితనానికి ఎవరెస్ట్ ఉంటే.. ఆ ఎవరెస్ట్ మెగాస్టార్. బాస్‌ను కామెంట్ చేస్తారు, ఆయన ఫ్యామిలీని కామెంట్ చేస్తారు.. ఆ తరవాత సైలెంట్‌గా వచ్చి బాస్‌తో ఫొటో దిగేస్తారు.అప్పుడప్పుడు అనుకుంటా.. బాస్‌లో ఈ మంచితనం ఏంటి అని. బాస్ ఎంతో ఉన్నత ఆశయాలతో స్థాపించిన బ్లడ్ బ్యాంక్‌పై కూడా కొంతమంది కామెంట్ చేశారు. ఒక పదేళ్ల తరవాత వాళ్లకు ఇప్పుడు జైలు శిక్ష విధించారు. కానీ, ఇన్నాళ్లూ గుండె రగిలిపోయిన, రక్తం మరిగిపోయిన నాలాంటి అభిమానులకు ఏంటిది? అంటే మనకు మీడియా లేదు. బాస్ ఇంట్లో రేడియో ఉంది కానీ.. మీడియా లేదు. అందుకే బాస్ మీద ఏదైనా నెగిటివ్‌గా వస్తే బ్రేకింగ్ వస్తుంది. బాస్ ఏదైనా మంచిపని చేస్తే స్క్రోలింగ్ వస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

‘రోజులు మారాయి బాస్. సోషల్ మీడియా వచ్చింది. ఫ్యాన్స్ అందరూ ఎడ్యుకేట్ అయ్యాం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి.. నా చిన్నప్పుడు సోషల్ మీడియా లేదు. టన్నుల్లో ఉన్న బాస్ క్రేజ్‌ని ఇన్‌స్టాలోని గ్రాములు కొలవగలవా? ఆయన ఫేస్ వేల్యూని కొలిచే ఫేస్‌బుక్ ఉందా? ట్వీట్స్‌కు తెలుసా ఆయన సక్సెస్ రూట్స్? సోషల్ మీడియాకు తెలియని సైంటిఫిక్ మిరాకిల్ ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా, పాన్ సౌత్ అంటున్నారు. మీరు పాన్ గ్లోబల్ సార్. అంటార్కిటికా వెళ్లినా అక్కడ ఒక మెగా అభిమాని జెండా ఎగరేస్తూ ఉంటాడు. అది బాస్ గొప్పతనం’ అని చిరంజీవిని ఆకాశానికి ఎత్తేశారు బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్.