Singer Malavika: మనసులు కలవాలే కానీ.. వయసు, అంతస్తు ఏపాటికి అడ్డురాదని ఇప్పటికే చాలా మంది ప్రముకులు ఒకటై రుజువు చేసి చూపించారు. ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటే.. వయసు అనేది పెద్ద ఆటంకం కాదని వారు అంటుంటారు. వివాహం చేసుకోవాలంటే అబ్బాయి వయసు అమ్మాయి కంటే కాస్త ఎక్కువ ఉండాలనేది ఎప్పటి నుంచో వింటున్న విషయం. ్యితే, ప్రేమకు, వివాహానికి వయసు సంబంధం ఏంటని ఇటీవల కొందరు ప్రశ్నిస్తున్నారు. క్రికెటర్ సచిన్ తెందూల్కర్ నుంచి నటి ప్రియాంక చోప్రా వరకు వీరి ప్రేమలో ఎప్పుడు వయసు వ్యత్యాసం సమస్య కానే కాలేదు. అసలు దానితో పెద్ద పనేమిటని వీరు అంటున్నారు. తాజాగా, ఇదే బాటలో ప్రయాణించి.. తన కంటే తక్కువ వయసున్న వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది ఓ గాయని.
https://www.instagram.com/p/CWIsJXqPgUW/?utm_source=ig_web_copy_link
సూపర్ సింగర్ ఫేమ్ మాళవిక సుందర్.. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఎంటర్ప్రెన్యూర్ అశ్విన్ కశ్యప్ రఘురామన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, ఇతను మాళవిక కంటే వయసులో చిన్నవాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో, మాళవికకు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
తమిళ సూపర్ సింగర్ షోలో ప్లేబ్యాక్ సింగర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది మాళవిక. తెలుగు, తమిళ్లో మంచి హిట్ సాంగ్స్‌ను పాడి.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్తానాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు 200కు పైగా పాటలు పాడిన మాళవిక.. పెళ్లికి వయసులతో సంబందం లేదని.. ఒకరినొకరు అర్థం చేసుకుని.. అభిప్రాయాలను గౌరవించుకుంటే చాలని అంటోంది.