Hero nithin: ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎటువంటి అండ లేకుండా.. కష్టపడి పైకి ఎదిగిన వారిలో హీరో నితిన్ ఒకరు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి కథ భిన్నంగా ఎంచుకుంటూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే, ఈ మధ్య వరుసగా పెద్దగా హిట్టు టాక్ దక్కించుకోలేకపోయారు నితిన్. ఇటీవల వచ్చిన చెక్ సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో పాటు రంగ్‌దే, మాస్ట్రో చిత్రాలు ఆవరేజ్ టాక్‌తో నిలిచాయి. కాగా, ప్రస్తుతం తన సొంత బ్యానర్లో తాజాగా తెరకెక్కిస్తోన్న సినిమా మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాను వచ్చే ఏడాది ఎప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
అయితే, విచిత్రం ఏంటంటే.. అదే రోజు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా కూడా విడుదల కానుంది. తెలుగు సినీ పరిశ్రమలో నిత్ పవన్‌కు ఎంత వీరాభిమానో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్లలో పవన్ సినిమాకు విజిల్ వేసే స్థాయి నుంచి.. తన సినిమాకు పవన్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చే స్థాయికి ఎదిగారు నితిన్. ఈ క్రమంలోనే వీరిద్దరు సినిమాలు ఒకే రోజు విడుదలవ్వడంపై ప్రస్తుతం అటు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, నట్టింట్లో చర్చలు నడుస్తున్నాయి.
కాగా, ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా.. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా బరిలోకి దిగనుంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రోమోలు సినిమాపై వేరే లెవెల్ అంచనాలు క్రియేట్ చేశాయి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Hero nithin releasing his movie macharla niyojakavargam movie by april 29 2021
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com