Aryan Khan arrest: డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ ‘షారుక్ ఖాన్’ కొడుకు ‘ఆర్యన్ ఖాన్’ అడ్డంగా బుక్ అయ్యాడు. నిజానికి గతంలో కూడా ఈ కుర్రాడి పై అనేక ఆరోపణలు వచ్చాయి. కొన్నిసార్లు పబ్ ల్లో మత్తులో తేలుతూ కనిపించాడు. అయినా, ఎన్నడూ ఈ స్టార్ కిడ్ పై పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. అయితే, పాపం పండి కుర్రాడు చేష్టలు మితిమీరి ఎన్‌సీబీ అధికారులకు డైరెక్ట్ గా పట్టుబడ్డాడు. కట్ చేస్తే.. అధికారులు అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు.

అయితే, విచిత్రంగా డ్రగ్స్ కేసులో బుక్ అయిన ఆర్యన్ ఖాన్ పై పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు ప్రేమను ఒలకబోస్తున్నారు. కొడుకు తప్పుడు పనికి షారుక్ ఖాన్ కి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదెక్కడ గోలరా బాబు ? కుర్రాడు ఏదో గోల్డ్ మెడల్ సాధించి తండ్రికి గొప్ప పేరు తీసుకొచ్చినట్లు.. షారుఖ్ కి పబ్లిక్ గా భరోసా ఇస్తున్నారు.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి పూజా భట్ ‘షారుఖ్ నేను నేకు సపోర్టుగా ఉంటాను. నీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. కానీ నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఈ సమయం కూడా గడిచిపోతుంది’ అంటూ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టింది. ఈమెగారు ‘చాహత్’ అనే సినిమాలో బాద్‌షా తో కలిసి నటించింది.
ఇక ‘కభీ హన్ కభీ నా’ అనే సినిమాలో షారుక్ సరసన ఆడిపాడిన సుచిత్ర కృష్ణమూర్తి కూడా ‘గతంలో కూడా ఇలాగే బాలీవుడ్ స్టార్స్ పై రైడ్స్ జరిగాయి. అయితే, ఆ రైడ్స్ లో ఏం దొరకలేదు. ఏది ప్రూవ్ అవ్వలేదు. అయినా మాతో ఇలా బిహేవ్ చేయడం మామూలు అయిపోయింది, అది మా ఫేమ్ ని దెబ్బతీస్తుందని వాళ్లకు ఎందుకు అర్ధం కాదో’ అంటూ రాసుకొచ్చింది.
పాపం సుచిత్ర కృష్ణమూర్తి ఏ విషయం పై ఏం కామెంట్స్ పెట్టిందో కూడా తెలుసో లేదో. ఇక ఫేడ్ అవుట్ హీరో సునీల్ శెట్టి కూడా పోస్ట్ చేస్తూ.. ‘ఆర్యన్ చిన్న పిల్లాడు. అతనికి కొంచెం ఊపిరి ఆడనివ్వండి’ అంటూ మెసేజ్ చేశాడు.
అసలు ఒక కుర్రాడు డ్రగ్స్ తీసుకుంటూ దొరికితే ఏమి చేయాలి ? మళ్ళీ అతను డ్రగ్స్ జోలికి వెళ్లకుండా కఠినంగా శిక్షించాలి. లేదా కనీసం మందలించాలి. కానీ ఇక్కడ ఏమి జరుగుతుంది ? మద్దతులు ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తాం అంటూ సానుభూతి ప్రకటిస్తున్నారు. కారణం.. స్టార్ హీరో కొడుకు అని, అదే ఏ సామాన్యుడి సుపుత్రుడో ఇలా చేస్తే.. ఇలాగే రియాక్ట్ అయ్యేవాళ్ళా ?