Nagarjuna: బిగ్ బాస్ నాలుగో వారం చివరి రోజైన ఆదివారం ఎన్నడూ జరగని అరుదైన ఘటన చోటుచేసుకుంది. సండే ఫన్ డే ఎపిసోడ్‌ను యథావిథిగా ఒక సాంగ్ తో స్టార్ట్ చేస్తాడు నాగ్. అలా టాలీవుడ్ హిట్ సాంగ్ ‘మాస్ మహారాజా రవితేజ’ పవర్ సినిమా లోని ‘నోటంకి’ లాంటి మాస్ సాంగ్ తో ఆదివారం ఎపిసోడ్ కి తనదైన స్టైల్ లో స్వాగతం చెప్తాడు నాగార్జున.

ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లు అందరూ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చి కింగ్ నాగార్జున ని ఒక ఎత్తు ఆశ్చర్యానికి గురి చేస్తారు. అలా 1996 లో కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున, టబు జంటగా నటించిన ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకు పాతికేళ్ళు నిండటంతో, ఆ సినిమా లోని సాంగ్స్ కి కంటెస్టెంట్లు స్పెషల్ పెర్ఫార్మన్స్ చేస్తారు. ఆసక్తికర విషయం ఏంటంటే…. ఈ సినిమాని స్వయానా నాగార్జున నిర్మించడం.
ఈ సందర్భంగా హౌస్ మేట్స్ చేసిన పర్ఫార్మెన్స్ లకి గాను ఒక్కసారిగా తన పాత నాటి సినిమా జ్ఞాపకాల్లోకి వెళ్తాడు నాగ్ . అద్భుతమైన మ్యూజికల్ హిట్ సాంగ్స్ అన్ని ఒకే సినిమాలో ఉండటం గమనార్హం. అలాంటిది ఇన్ని బ్యూటిఫుల్ హిట్ సాంగ్స్ అన్ని నిన్నే పెళ్లాడతా సినిమాలో ఉండటం చాలా గొప్ప విషయం. అలాంటి సాంగ్స్ అన్నిటిని మీరు చాల అద్భుతంగా ప్రదర్శించారు, దానికి గాను నాకు గూస్ బంప్స్ వచ్చాయి, ఒక్కసారిగా నా కళ్ళు కూడా చెమర్చాయి అంటూ …. హౌస్ మేట్స్ ని అందరిని అభినందిస్తూ భావోద్వేగానికి గురవుతాడు కింగ్ నాగార్జున