https://oktelugu.com/

Shah Rukh Khan: కూతురు కోసం హంతకుడిగా మారిపోయిన షారుఖ్ ఖాన్..షాక్ లో ఫ్యాన్స్.. అసలు ఏమైందంటే!

షారుఖ్ ఖాన్ కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. కొడుకుల పేర్లు ఆర్యన్ ఖాన్, అబ్రం ఖాన్ కాగా కూతురు పేరు సుహానా ఖాన్. ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ లకు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ గా నటించే వయస్సు వచ్చేసింది. ఆర్యన్ ఖాన్ సినిమాల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ, సుహానా ఖాన్ కి మాత్రం సినిమాల్లో నటించేందుకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 18, 2024 / 11:24 AM IST
    Follow us on

    Shah Rukh Khan: ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు షారుఖ్ ఖాన్. ఎన్ని ఫ్లాప్స్ పడిన చెక్కు చెదరని క్రేజ్ ఆయన సొంతం. కెరీర్ ప్రారంభం లో ఆయన చేసిన సినిమాలు అలాంటివి మరి. లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్ తో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న షారుఖ్ ఖాన్, రీసెంట్ గానే జవాన్, పఠాన్ చిత్రాలతో రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కసారి వెయ్యి కోట్ల మార్కుని అందుకోవడమే కష్టం అవుతున్న ఈరోజుల్లో, షారుఖ్ ఖాన్ రెండు సార్లు అవలీలగా ఆ ప్రెస్టీజియస్ మార్కుని అందుకోవడం అంటే ఆయన స్టార్ డమ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

    ఇదంతా పక్కన పెడితే షారుఖ్ ఖాన్ కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. కొడుకుల పేర్లు ఆర్యన్ ఖాన్, అబ్రం ఖాన్ కాగా కూతురు పేరు సుహానా ఖాన్. ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ లకు సినిమాల్లో హీరో, హీరోయిన్స్ గా నటించే వయస్సు వచ్చేసింది. ఆర్యన్ ఖాన్ సినిమాల్లోకి వస్తాడో లేదో తెలియదు కానీ, సుహానా ఖాన్ కి మాత్రం సినిమాల్లో నటించేందుకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఇప్పటికే ఈమె నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మించిన ‘ది ఆర్చీస్’ అనే చిత్రం లో నటించింది. 2023 వ సంవత్సరం లో నేరుగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సుహానా ఖాన్ కి మాత్రం మంచి పేరొచ్చింది. ఇప్పుడు ఈమె వెండితెర అరంగేట్రం కోసం షారుఖ్ ఖాన్ పక్కా గ్రౌండ్ ని సిద్ధం చేసాడు. సుజయ్ జోష్ దర్శకత్వం లో సుహానా ఖాన్ గ్రాండ్ గా వెండితెర అరంగేట్రం చేయబోతుంది.

    ఈ చిత్రం లో ప్రముఖ బాలీవుడ్ క్రేజీ హీరో, అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తుండగా, మూంజ్య ఫేమ్ అభయ్ వర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సౌత్ ఇండియన్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఆయన సుహానా ఖాన్ కి గురువుగా కనిపించబోతున్నాడని నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ మీడియా లో వినిపించిన వార్త. కానీ ఇప్పుడు ఆ పాత్ర కాదని, ఇందులో షారుఖ్ ఖాన్ కిల్లర్ పాత్రలో కనిపిస్తున్నదని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబద్దం అనేది అభిమానులు కనిపెట్టలేకపోతున్నారు. అయితే గురువు పాత్రలోనే కిల్లర్ షేడ్ కూడా ఉంటుందని, ఇది సినిమాలో కీలకమైన ట్విస్ట్ గా ఉండే ఛాన్స్ ఉందని మరికొందరు అంటున్నారు. వీటిలో ఏది నిజం అనేది త్వరలోనే అధికారిక ప్రకటన ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియచేయబోతున్నట్టు తెలుస్తుంది.