https://oktelugu.com/

Android mobile: ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు వాడే వారందరికీ ఇదో హెచ్చరిక.. వెంటనే తెలుసుకోండి

నేటి కాలంలో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఉంటుంది. ఫోన్ మాట్లాడడానికి మాత్రమే కాకుండా బ్యాంకు వ్యవహారాలు జరిపేందుకు మొబైల్ కీలకంగా మారింది.పెద్ద పెద్ద మొత్తాలు సైతం మొబైల్ ద్వారా ఇతరులకు పంపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది

Written By:
  • Srinivas
  • , Updated On : October 18, 2024 / 11:24 AM IST

    Android-Mobiles

    Follow us on

    Android mobile: నేటి కాలంలో ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ ఉంటుంది. ఫోన్ మాట్లాడడానికి మాత్రమే కాకుండా బ్యాంకు వ్యవహారాలు జరిపేందుకు మొబైల్ కీలకంగా మారింది.పెద్ద పెద్ద మొత్తాలు సైతం మొబైల్ ద్వారా ఇతరులకు పంపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ ను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొందరు హ్యాకర్లు మొబైల్ వివరాలు తెలుసుకొని అందులో బ్యాంకు అకౌంట్ ద్వారా తమ ఖాతాలోకి నగదును ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్నారు. ఈ తరుణంలో మొబైల్ లో ఎలాంటి మాల్ వేర్ రాకుండా జాగ్రత్త పడాలి. అయితే తాజాగా ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT In) ’ ఓ హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే?

    మొబైల్ హ్యాకింగ్ గురించి ఈ మధ్య చాలా వార్తలు వింటున్నాం. కొన్ని ముఖ్యమైన పనులకు కూడా మొబైల్ కీలకంగా ఉండడంతో దీనిని హ్యాక్ చేయడం వల్ల ఈజీగా నగదును దోచుకోవచ్చని కొందరు హ్యాకర్లు ఎప్పుడూ వీటిపైనే ఫోకస్ చేస్తుంటారు. ఈ తరుణంలో మొబైల్ కు కొన్ని మాల్ వేర్ పంపించి వాటి ద్వారా ఫోన్ వివరాలు తెలుసుకుంటారు. తాజాగా CERT In చెప్పిన ప్రకారం ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కొన్ని సమస్యలు గుర్తించినట్లు తెలిసింది. ఈ వెర్షన్ లోని కొన్ని మోడళ్లను హ్యాకర్లు ఈజీగా వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని తెలిపింది.

    ఆండ్రాయిడ్ వెర్షన్ లోని 12,12 L, 13, 14, 15 వెర్షన్లలో ఈ సమస్యలు అధికంగా ఉన్నాయని CERT In తెలిపింది. ఈ వెర్షన్ మొబైల్స్ లో కొన్ని భాగాల ద్వారా హ్యాక్ చేయొచ్చని తెలిపింది. మొబైల్స్ లో ఉండే మీడియా టెక్ కాంపౌనెంట్స్, గూగుల్ ప్లే, క్వాల్ కమ్ క్లోస్డ్ సోర్స్, ఇమేజినేషన్ టెక్నాలజీ సమస్యలు మొబైల్స్ లో ఏర్పడితే వెంటనే అప్రమత్తం కావాలని సూచించించింది. వీటి ద్వారా బ్యాంకు వివరాలు తెలుసుకునేందుకు ఈజీగా ఉంటుందని తెలిపింది. ఆతరువాత హ్యాకర్లు బ్యాంకులో డబ్బు ఉండే మొత్తం ఖాళీ చేసే అవకాశం ఉందని పేర్కొంది.

    అయితే ఈ సమస్యల నుంచి బయటపడడానికి మొబైల్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలిపింది. ముఖ్యంగా ఫోన్ లోకి ఎలాంటి కొత్త యాప్ లు వచ్చినా ఇన్ స్టార్ చేయకుండా ఉండాలి. అలాగే తమ యాప్ లకు ఎక్కువ కాలం వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. మొబైల్ సాప్ట్ వేర్ అప్డేడ్ అడిగితే వెంటనే చేసుకోవాలని సూచించింది. మొబైల్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం వల్ల హ్యాకర్స్ కు చిక్కకుండా ఉండొచ్చు.

    ముఖ్యంగా మొబైల్ లో ఫొటో ఎడిట్ కు సంబంధించిన యాప్ లకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి ద్వారా హ్యాకర్లు మొబైల్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అలాగే తరుచుగా మొబైల్ స్విచ్ఛాఫ్ కావడం, అనుకోని యాప్ లు ఇన్ స్టాల్ కావడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా తెలియని ప్రదేశాల్లో ఛార్జింగ్ పెట్టడం సేఫ్ కాదని అంటున్నారు.