https://oktelugu.com/

Gaganyaan mission: ‘గగన్‌యాన్‌’ లో ఇస్రో కు దేశీయ కంపెనీల తోడు

ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ మిషన్‌ కోసం ఇస్రోకు అనేక దేశీయ కంపెనీలు తమ సహకారం అందిస్తున్నాయి. ప్రాజెక్టుకు కావాల్సిన పరికరాలతోపాటు ముందస్తు పరీక్షలకు అవసరమైన మా డ్యూళ్లను అందిస్తున్నాయి.

Written By:
  • Rocky
  • , Updated On : October 9, 2023 1:33 pm
    Gaganyaan-mission
    Follow us on

    Gaganyaan mission: ఇస్రో.. గగనతలంలో అనితర సాధ్యమైన విజయాలు సాధిస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాలు అబ్బుర పడేవిధంగా ప్రయోగాలు చేస్తోంది. ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా తన వాహక నౌక ద్వారా అంతరిక్షంలో ప్రవేశపెడుతోంది. అయితే అలాంటి ఇస్రో తన ప్రయోగాలకు సంబంధించిన పరికరాలను మొత్తం గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. కానీ ఇప్పుడు పూర్తిగా స్వదేశీ మంత్రాన్ని పఠిస్తున్నది. స్థానికంగా ఉన్న కంపెనీలకు ఆ బాధ్యతలు అప్పగించి అత్యంత చవకగా తన ప్రయోగాలను పూర్తిచేస్తున్నది.

    ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ మిషన్‌ కోసం ఇస్రోకు అనేక దేశీయ కంపెనీలు తమ సహకారం అందిస్తున్నాయి. ప్రాజెక్టుకు కావాల్సిన పరికరాలతోపాటు ముందస్తు పరీక్షలకు అవసరమైన మా డ్యూళ్లను అందిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ముగ్గురు వ్యోమగాములను 400కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెడతారు. మూడు రోజుల తర్వాత వారిని సముద్ర జలాల్లో ల్యాండింగ్‌ చేయడం ద్వారా సురక్షితంగా భూమికి తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది. ఈ ప్రయోగం నిర్వహించడానికి ముం దుగా దాని సన్నద్ధత స్థాయిని ప్రదర్శించడానికి ఉద్దేశించిన రెండు ఇంటిగ్రేటెడ్‌ ఎయిర్‌డ్రాఫ్ట్‌ టెస్ట్‌-క్రూ మాడ్యూళ్ల (ఐఏడీసీ-సీఎం)కోసం చెన్నైలోని కేసీపీ లిమిటెడ్‌కు చెందిన హెవీ ఇంజనీరింగ్‌ యూనిట్‌కు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ఆర్డర్‌ ఇచ్చింది. 3,120 కిలోల బరువు, 3.1 మీటర్ల వ్యాసం, 2.6 మీటర్ల ఎత్తుతో అల్యూమినియంతో రూపొందించిన మొదటి ఐఏడీసీ-సీఎంను ఇటీవల చెన్నైలో ఇస్రో హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ యాక్టింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌.హట్టన్‌కు కేసీపీ గ్రూప్‌ చైర్‌పర్సన్‌, ఎండీ వి.ఎల్‌. ఇందిరా దత్‌ అందజేశారు.

    ఈ మిషన్‌కు సన్నద్ధంకావడంలో హైదరాబాద్‌కు చెందిన మంజీరా మెషిన్‌ బిల్డర్స్‌, శ్రీ వెంకటేశ్వర ఏరోస్పేస్‌, ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ వంటి సూక్ష్మ, చిన్న కంపెలతోపాటు అనంత్‌ టెక్నాలజీస్‌, ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ సహకారం అందిస్తున్నాయి. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ముందు వివిధ పరీక్షలు నిర్వహించడానికి వీలుగా సిమ్యులేటెడ్‌ క్రూ మాడ్యూల్స్‌ (ఎస్‌సీఎం) తయారీ నుంచి క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌కు అవసరమైన హార్డ్‌వేర్‌, క్రిటిక్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ల వరకూ ఇవి సమకూర్చాయి. కాగా, సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ప్రయోగించిన ఆదిత్య ఎల్‌-1తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోందని ఇస్రో ఆదివారం తెలిపింది. ‘‘స్పేస్‌క్రాఫ్ట్‌ పనితీరు బాగుంది. లాగ్రాంజియన్‌ పాయింట్‌ ఎల్‌-1 దిశగా దూసుకెళ్తోంది. దానిలోని ఇంజన్లను 16సెకన్లపాటు మండించి ఈనెల 6న ట్రాజెక్టరీ కరెక్షన్‌ మాన్యువర్‌ను నిర్వహించాం’’అని ఇస్రో ట్వీట్‌ చేసింది.