Israel vs Hamas: ఇజ్రాయెల్ వర్సెస్ హమాస్: మధ్యలో ఎంటరైన అమెరికా

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంతో అగ్రరాజ్యం అమెరికా రాజకీయం వేడెక్కింది. జో బైడెన్‌ ప్రభుత్వం ఇరాన్‌కు చేసిన ఆర్థిక సాయంతోనే హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడ్డారంటూ

Written By: Bhaskar, Updated On : October 9, 2023 1:25 pm
Follow us on

Israel vs Hamas: చైనా అంతకంతకు ఎదిగిపోతోంది. కనివిని ఎరుగని స్థాయిలో ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకుంటున్నది. అగ్రరాజ్యంగా ఎదగాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే చైనా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అమెరికా రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా హమాస్, ఇజ్రాయిల్ మధ్య ప్రారంభమైన యుద్ధం.. అమెరికాకు వరంలాగా మారినట్టుంది. ప్రపంచంలో మెజారిటీ దేశాలు కూడా ఇజ్రాయిల్ కు అండగా ఉన్న నేపథ్యంలో.. అమెరికా కూడా ఇప్పుడు అదే పాట అందుకుంది. ఇజ్రాయెల్‌కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధరంగంలోకి దిగుతోంది.

మిలటరీ ఎయిడ్‌ ప్యాకేజీ కింద రూ.66 వేల కోట్ల(8 బిలియన్‌ డాలర్లు) మేర సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతాన్యాహుకు ఫోన్‌ చేశారు. తమ మద్దతు ఇజ్రాయెల్‌కు ఉంటుందని, ప్రతిదాడులు చేయడం ఇజ్రాయెల్‌ హక్కు అని భరోసా ఇచ్చారు. మరోవైపు ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ స్ట్రైక్‌ గ్రూప్‌(సీఎస్జీ )ని ఇజ్రాయెల్‌కు మద్దతుగా పంపుతామని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఈ నౌకలో 65-70 యుద్ధ విమానాలు, కనీసం రెండు డిస్ట్రాయర్స్‌లేఏదా ఫ్రిగేట్స్‌ స్క్వాడ్రన్లు, 7,500 మంది సిబ్బంది, సైనికులు ఉంటారు. వీరిలో 5 వేల మంది యూఎస్ ఎస్ గెరాల్డ్‌.ఆర్‌.ఫోర్డ్‌ విభాగానికి చెందిన సెయిలర్లు కావడం గమనార్హం.

అమెరికా నిధులతోనే ఇజ్రాయెల్‌పై దాడి

ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధంతో అగ్రరాజ్యం అమెరికా రాజకీయం వేడెక్కింది. జో బైడెన్‌ ప్రభుత్వం ఇరాన్‌కు చేసిన ఆర్థిక సాయంతోనే హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడికి తెగబడ్డారంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణలే ఇందుకు కారణం. ట్రంప్‌ నిరాధర ఆరోపణలు చేస్తున్నారంటూ వైట్‌ హౌస్‌ వర్గాలు కూడా బదులివ్వడంతో విషయం మరింత హీటెక్కింది. ‘హమాస్‌ చేస్తోన్న దాడులు సిగ్గుచేటు. అన్ని శక్తులను ఒడ్డి ఈ దాడులను తిప్పికొట్టే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. బైడెన్‌ ప్రభుత్వం విడుదల చేసిన అనేక నివేదికల ప్రకారం.. అమెరికా పౌరులు పన్నుల రూపంలో కట్టిన డాలర్లు ఈ దాడుల వెనక ఉండటం బాధాకరం’ అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఓ ప్రకటన చేశారు. కాగా, ట్రంప్ వ్యాఖ్యల పట్ల అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నేతలు, అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న వివేక్ రామస్వామి దీనిపై ఎటువంటి కామెంట్స్ చేయకపోవడం విశేషం.