https://oktelugu.com/

Mokshagna Teja: శ్రీలీల విషయంలో నీ గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అని మోక్షజ్ఞ తిట్టాడు..!

ఈ క్రమంలో శ్రీలీల గురించి మాట్లాడుతూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మోక్షజ్ఞను ఉద్దేశిస్తూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. శ్

Written By:
  • Shiva
  • , Updated On : October 9, 2023 / 01:38 PM IST
    Follow us on

    Mokshagna Teja: వరంగల్ వేదికగా బాలకృష్ణ లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుక జరిగింది. బాలకృష్ణ, శ్రీలీల, కాజల్ అగర్వాల్ తో పాటు చిత్ర యూనిట్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ట్రైలర్ లో చూసింది తక్కువే. ఇంకా చాలా దాచిపెట్టాము. దర్శకుడు అనిల్ రావిపూడి ఎంటర్టైనింగ్ దర్శకుడు. పటాస్ సినిమాలో నా పర్మిషన్ లేకుండా నా పాట వాడేశాడు. విడుదలకు ముందు ఇంకా సర్ప్రైజ్ లు ఉంటాయి, అన్నారు.

    ఈ క్రమంలో శ్రీలీల గురించి మాట్లాడుతూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. మోక్షజ్ఞను ఉద్దేశిస్తూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. శ్రీలీల ఈ మూవీలో చిచ్చా చిచ్చా అంటూ టార్చర్ పెట్టింది. నెక్స్ట్ మూవీలో నా పక్కన హీరోయిన్ గా చేయాలి అన్నాను. ఇదే విషయం ఇంటికి వెళ్లి నా భార్య, కొడుకు మోక్షజ్ఞతో చెప్పాను. మావాడికి కోపం వచ్చింది. ఏం డాడీ… నేను యంగ్ హీరోని. సినిమాల్లోకి రాబోతున్నాను. నాపక్కన శ్రీలీల నటించాలి కానీ. నీకు శ్రీలీల అవసరమా?. నీకు గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా? అన్నాడు, అని బాలయ్య అన్నారు.

    దాంతో వేదిక మీద ఉన్నవాళ్ళందరూ షాక్ అయ్యారు. బాలయ్య ఈ విషయాన్ని సరదాగా చెప్పినా… కన్న తండ్రిని కొడుకు అంత పెద్ద బూతు మాట అనడం, దాన్ని ఆయన పబ్లిక్ లో బహిర్గతం చేయడం చర్చకు దారి తీసింది. మోక్షజ్ఞకు తండ్రి అంటే కనీస భయం, మర్యాద లేదా అంటున్నారు. కన్న తండ్రిని అంత మాటంటే ఇంటి నుండి బయటకు వెళ్ళగొడతారని నెటిజెన్స్ అంటున్నారు. బాలయ్య ఫ్లోలో చేసిన కామెంట్స్ విమర్శలకు దారి తీశాయి.

    ఇక భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. కాజల్ అగర్వాల్ మొదటిసారి బాలయ్యతో జతకడుతుంది. విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. కాజల్ బాలయ్య భార్య పాత్ర చేస్తుంది. అయితే కథ మొత్తం శ్రీలీల చుట్టూ తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. బాబాయి-అమ్మాయిగా వీరు నటిస్తున్నారు. అర్జున్ రామ్ పాల్ విలన్ రోల్ చేశారు. థమన్ సంగీతం అందించారు. అఖండ, వీరసింహారెడ్డి చిత్ర విజయాలతో ఊపు మీదున్న బాలయ్య హ్యాట్రిక్ పై కన్నేశాడు.

    Tags