Tirumala: రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ఝలక్‌ ఇచ్చిన మొదటి భార్య.. పెళ్లి పీటలపై నుంచే భర్త పరార్‌.. నూతన వధువు షాక్‌!

మన వివాహ బంధానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మన సంస్కృతి, సంప్రదాయాలే కాదు.. వైవాహిక బంధానికి మనం ఇచ్చే విలువ, గౌరవం అటువంటిది.

Written By: Raj Shekar, Updated On : August 9, 2024 3:24 pm

Tirumala

Follow us on

Tirumala: భారత దేశంలో హిందూ వివాహ బంధానికి ప్రత్యేమైన గుర్తింపు ఉంది. మన సంస్కృతి, పెళ్లి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు విదేశీయులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందుకే చాలా మంది విదేశీయులు మన హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక మన దేశంలో వైవాహిక బంధాలు కూడా దృఢంగా ఉంటాయి. పాశ్చాత్య దేశాల్లో లాగా మూణ్ణాళ్ల ముచ్చట కాదు. ముఖ్యంగా పెద్దలు కుదిర్చిన వివాహాలు కలకాలం వర్ధిల్లుతున్నాయి. ప్రేమ పెళ్లిళ్లు 50 శాతం ఫెయిల్‌ అవుతున్నాయి. అయితే దశాబ్దాకాలంగా మన వివాహ వ్యవస్థలోకి కూడా విదేశీ సంస్కృతి చొరబడింది. ఆ మోజులో పడి బలమైన వివాహ బంధాలను బలహీనం చేస్తున్నాయి. టీవీలు, సినిమాలు, ఫోన్ల ప్రభావంతో వివాహ బంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. కడవరకూ కలిసి ఉంటామని ప్రమాణం చేసిన దంపతులు మధ్యలోనే మనస్పర్థలతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కొందరైతే తమ స్వేచ్ఛకు అడ్డుగా ఉంటున్నారని భర్త లేదా భార్తను చంపేస్తున్నారు. దీంతో పిల్లలు అనాథలవుతున్నారు. క్షణికావేశంలో చేసే పొరపాటు, క్షణకాలం సుఖం కోసం చేసే తప్పులతో పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. ఇక కొందరు ఈజీ మానీ కోసం రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అబ్బాయిలు నిత్య పెళ్లి కొడుకుల్లా మారుతుంటే.. అమ్మాయిలు నిత్య పెళ్లి కూతురు అవుతున్నారు. భార్య పిల్లలు ఉండగానే కొందరు మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు. పెళ్లయిన విషయం దాచి రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఇక అమ్మాయిలు అయితే అబ్బాయిలపై కట్నం వేధింపు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు. ఇక కొందరు భార్యలే.. భర్త కోరుకున్నాడని రెండో పెళ్లి కూడా చేస్తున్నారు. కొందరు భర్తలు కూడా తన భార్యను ఆమె ప్రియుడికి అప్పగిస్తున్నారు. కారణం ఏదైనా కావొచ్చు. కానీ, మన వివాహ బంధం కూడా క్రమంగా బలహీనపడుతోంది. తాజాగా ఓ ప్రబుద్ధుడు భార్య, బిడ్డ ఉండగానే మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసిన మొదటి భార్య తన బిడ్డను తీసుకుని పెళ్లి పందిట్లోకి వచ్చి భర్తకు ఝలక్‌ ఇచ్చింది.

విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి..
తిరుపతిలో ఓ ప్రబుద్ధుడు మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య నేరుగా పెళ్లి మండపానికే వచ్చింది. ఆమెను చూసిన భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కలకలం రేపింది. రాకేశ్‌ అనే వ్యక్తికి వరంగల్‌ జిల్లా పెద్ద పెండ్యాల్‌కు చెందిన సంద్యతో పెళ్లి జరిగింది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. వీడి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ వ్యవహారం కొలిక్కి రాకుండానే రాకేశ్‌ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. తిరుమల సిద్ధేశ్వర మఠంలో గుట్టుగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఈమేరకు అంతా ఏర్పాట్లు చేసుకున్నారు. ముహూర్తానికి సమయం దగ్గరపడుతోంది. వధువుతోపటు ఆమె తరఫున బంధువులు కూడా మండపానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడికి మొదటి భార్య, ఆమె కుటుంబ సభ్యులు రావడంతో షాక్‌ అయ్యాడు వరుడు.

కేసు నమోదు చేసిన పోలీసులు..
మొదటి భార్య పెళ్లి మండపానికి రావడం గమనించిన రాకేశ్‌ పారిపోయే ప్రయత్నం చేశాడు. అయతే సంధ్య కుటుంబ సభ్యులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తనకు విడాకులు ఇవ్వకుండానే రాకేశ్‌ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజకీయ అండతో తనను చంపుతాని బెదిరిస్తున్నాడని పేర్కొంది. తనతోపాటు తన కూతురుకు న్యాయం చేయాలని వేడుకుంది. ఇదిలా ఉంటే.. పెళ్లికి సిద్ధమైన మరో వధవు ఈ పరిణామాలతో షాక్‌కు గురైంది. కోర్టులో విడాకుల అంశం తేలకుండానే.. మరో పెళ్లికి సిద్ధమైన భర్తకు మొదటి భార్య షాక్‌ ఇవ్వమే కాకుండా మరోమారు జైలుకు పంపింది.