Sarpanch Elections
Sarpanch Elections: తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2025లో సర్పంచ్(Sarpanch) ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నికలు ఆలస్యమైన నేపథ్యంలో, త్వరితగతిన ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం అధికారులకు సూచనలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం, మరింత ఉత్తేజంగా మారనుంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, కుల గణన ద్వారా వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం స్థానాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది నిజమైతే, ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చు.
అధికార యంత్రాంగం సమాయత్తం..
సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను పక్కాగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలతో పాటు ఎంపీటీసీ(MPTC), జెడ్పీటీసీ(ZPTC) ఎన్నికలు కూడా ఈ షెడ్యూల్‌లో భాగంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో తమ బలాన్ని నిరూపించుకునే అవకాశంగా భావిస్తున్నారు. అదే సమయంలో, బీఆర్‌ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీని తీవ్రతరం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయ చర్చలు ఊపందుకోనున్నాయి. రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన కోసం అందరి దష్టి ప్రభుత్వం వైపు మళ్లింది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Sarpanch elections june revanth sarkar announces schedule
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com