RRR Movie Dialogues in Telugu: నేషనల్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ స్థాయి ఏంటో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా మరోసారి ఘనంగా రుజువు అయ్యింది. విపరీతమైన అంచనాల మధ్య విడుదల అయిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అద్భుతమైన టాక్ తో భారీ కలెక్షన్స్ తో అదరగొడుతుంది. అయితే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎమోషన్స్, విజువల్స్ ఎంత గొప్పగా హైలైట్ అయ్యాయో.. అంతే గొప్పగా డైలాగ్స్ కూడా హైలైట్ అయ్యాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్ – చరణ్ చెప్పిన డైలాగ్స్ సినిమాకే స్పెషల్ గా నిలిచాయి. అలాగే మల్లిక అనే అమ్మాయి పాత్ర డైలాగ్ కూడా మనసును హత్తుకుంది. అందుకే.. ‘ఆర్ఆర్ఆర్’ డైలాగ్స్ కోసం ప్రేక్షకులు రెట్టింపు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ‘ఆర్ఆర్ఆర్’ కొన్ని ఎమోషనల్ అండ్ డెప్త్ డైలాగ్స్ మీ కోసం…
ఎన్టీఆర్ : పాణం కన్నా విలువైన నీ సోపథి నా సొంతం అన్నా, గర్వంతో గీ మన్నులో కలిసి పోతనే.
ఎన్టీఆర్ : తొంగి తొంగి నక్కి నక్కే గాదే. తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోన్ని ఏసుకుంటా పోవాలే.
చరణ్: బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన నేరానికి, నిన్ను అరెస్ట్ చేస్తున్నాను.
చరణ్: భీం, ఈ నక్కల వేట ఎంతసేపు..! కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా.
యుద్దాన్ని వెతుకుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి.
ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టు వుంటది.
కలబడితే యేగు చుక్క ఎగబడి నట్టు వుంటది.
ఎదురు పడితే చావు కైనా చెమట ధారా కడతది.
ప్రాణమైన, బందువుకైనా వాడికి వాంఛానవుతాది.
ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదారి,
నా అన్న మన్యం దొర అల్లూరి సీతా రామ రాజు.
వాడు కనపడితే సముద్రాలూ తడపడతాయ్.
నిలపడితే సామ్రాజ్యాలు సాకిలపడతాయ్.
వాడి పొగరు ఎగిరే జెండా.
వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.
వాడు భూతల్లి చనుపాలు తాగిన ముద్దు బిడ్డ.
నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురం భీం.
స్కాట్ దొరవారు మా ఆదిలాబాద్ వచ్చినప్పుడు, ఓ చిన్న పిల్లను తీసుకువచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి.
అయితే వాళ్ళకేమైనా రెండు కొమ్ములుంటాయా?
అమ్మా..!!)
ఒక కాపరి ఉంటాడు.
పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి.
ఆ పని చేయగలిగేది ఒక్కడే సర్.
నన్నీడ ఇడిసి పోకన్నా. అమ్మ యాదికొస్తుందన్నా.