https://oktelugu.com/

Robinhood Movie Teaser: ఆకట్టుకుంటున్న నితిన్ ‘రాబిన్ హుడ్’ టీజర్..నవ్వులు పూయించిన చివరి డైలాగ్..ఈసారి హిట్ కొట్టేసినట్టే!

భారీ అంచనాల నడుమ విడుదలైన 'మాచెర్ల నియోజకవర్గం' చిత్రం ఓపెనింగ్స్ లో పర్వాలేదు అనిపించింది కానీ, ఫుల్ రన్ లో మాత్రం డిజాస్టర్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత వచ్చిన 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' కి అయితే ఓపెనింగ్స్ రాలేదు, లాంగ్ రన్ కూడా రాలేదు. నితిన్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది ఈ సినిమా.

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 04:46 PM IST

    Robinhood Movie Teaser

    Follow us on

    Robinhood Movie Teaser: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకడు నితిన్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ ని షేక్ చేసిన ఈయన, ఆ తర్వాత కూడా వరుసగా సూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు. అదే సమయంలో వరుసగా 14 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను కూడా అందుకున్నాడు. కెరీర్ ఇక అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయంలో ‘ఇష్క్’ వంటి సూపర్ హిట్ తో ఫామ్ లోకి వచ్చిన నితిన్, ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే ఈమధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రం ఓపెనింగ్స్ లో పర్వాలేదు అనిపించింది కానీ, ఫుల్ రన్ లో మాత్రం డిజాస్టర్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ కి అయితే ఓపెనింగ్స్ రాలేదు, లాంగ్ రన్ కూడా రాలేదు. నితిన్ కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది ఈ సినిమా.

    ఇప్పుడు అర్జెంటు గా నితిన్ కి ఒక హిట్ కావాలి. అందుకే తనకి ‘భీష్మ’ లాంటి సూపర్ హిట్ ని అందించిన వెంకీ కుడుముల తో కలిసి ‘రాబిన్ హుడ్’ అనే చిత్రంలో నటించాడు. శ్రీలీలే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే విడుదల చేయగా, సోషల్ మీడియా లో ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు ఆకట్టుకోలేదని ఈ టీజర్ ని చూసిన ఆడియన్స్ చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో నితిన్ ఒక దొంగ లాగా కనిపించనున్నాడు. వివిధ రకాల వేషధారణలతో ఆయన దొంగతనాలు చేస్తూ, పోలీసులకు దొరకకుండా తిరుగుతాడు. అలాంటి వ్యక్తి కెరీర్ లోకి శ్రీలీల రావడం, ఆమెతో ఈయన ప్రేమలో పడడం ఇవన్నీ షరామామూలే. చాలా రొటీన్ స్క్రిప్ట్ లాగానే అనిపిస్తుంది కానీ, టేకింగ్ విషయంలో డైరెక్టర్ వెంకీ అదరగొట్టేస్తాడని అంటున్నారు ఆడియన్స్.

    వెంకీ కుడుములకి మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. ఆయన సినిమాలు సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం కామెడీనే. ఈ చిత్రంలో కూడా కామెడీ టైమింగ్ బాగానే ఉన్నట్టు టీజర్ ని చూస్తే అర్థం అవుతుంది. టీజర్ చివర్లో నితిన్ అరబ్ గెటప్ లో విమానాశ్రయం నుండి వస్తుంటాడు. పోలీసులు అతన్ని ఆపి ‘నువ్వు అరబ్ వా’ అని అడుగుతారు. అప్పుడు నితిన్ కాదు అని సమాధానం చెప్పగా, మరి అరబ్ డ్రెస్ ఎందుకు వేసుకున్నావ్ అని పోలీస్ అడుగుతాడు. అప్పుడు నితిన్ అటుగా వస్తున్న అమ్మాయిని చూపించి, ఆమె పంజాబీ అమ్మయినా? అని అడుగుతాడు, దానికి పోలీస్ కాదు అని సమాధానం చెప్పగా, మరి ఆమె పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుంది అని అడుగుతాడు. ఇలాంటి పంచులు సినిమాలో చాలానే ఉన్నాయి. డిసెంబర్ 25 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా నితిన్ కెరీర్ లో కమర్షియల్ హిట్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.