Shruti Haasan : సౌత్ ఇండియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిన హీరోయిన్స్ లో ఒకరు శృతి హాసన్. యూత్, మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈమెకి ఫ్యామిలీ ఆడియన్స్ లోనూ సమానమైన క్రేజ్ ఉంది. కమల్ హాసన్ లాంటి మహానటుడు కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే ఈమె నటనను కమల్ హాసన్ తో పోల్చి చూస్తారు. అందులో పావు శాతం లేకపోయినా కూడా జనాలు ఆదరించరు. ఇంత పెద్ద రిస్క్ ఉన్నప్పటికీ కూడా శృతి హాసన్ తన సొంత దారిలో వెళ్లి సక్సెస్ అయ్యింది. సిద్దార్థ్ నటించిన ‘అనగనగ ఒక ధీరుడు’ చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు రావడం ఆగలేదు. వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉండేది, కానీ చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యేది. ఆమె కెరీర్ లో మొట్టమొదటి హిట్ చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ తో సినిమాలు చేస్తూ, హిట్లు, సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్లు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదంతా పక్కన పెడితే ‘గబ్బర్ సింగ్’ కి ముందు ఈమె చేసిన సినిమాలలో ‘3 ‘ అనే చిత్రం ఒక తమిళ చిత్రం ఉంది. ఈ సినిమా ద్వారానే అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఆయన కంపోజ్ చేసిన ‘వై థిస్ కొలవరి’ అనే సాంగ్ అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపింది. ఈ పాటకి ధనుష్ తన గాత్రాన్ని అందించాడు. ఈ పాట పెద్ద హిట్ అవ్వడంతో ఆ సినిమాపై విపరీతమైన హైప్ ఏర్పడింది. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్ద ఫ్లాప్ అయింది కానీ, ఇటీవల కాలం లో ఈ సినిమాని రెండు సార్లు రీ రిలీజ్ చేస్తే, రెండు సార్లు కూడా అద్భుతమైన వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శృతి హాసన్ ఈ చిత్రం అనుభూతులను పంచుకుంటూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘అప్పట్లో ఎంతో ఇష్టంతో చేసిన సినిమా ఇది. ఆరోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదలై పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా ఫలితం నా కెరీర్ మీద ప్రభావం చూపించింది. రెండేళ్ల పాటు నాకు ఎవ్వరూ సినిమా అవకాశాలు కూడా ఇవ్వలేదు. నా కెరీర్ ఈ చిత్రంతోనే ముగిసిపోయింది, వేరే మార్గం ఏదైనా చూసుకుందాం అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్.