Ravi Teja vs Chiranjeevi: సినీ ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి వీరాభిమాని అని చెప్పుకొని తిరిగే హీరోలలో ఒకరు మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja). కెరీర్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు వీళ్లిద్దరు కలిసి ‘అన్నయ్య’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా పైకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ లోకి వచ్చాను అంటూ రవితేజ ఎన్నో వందల సందర్భాల్లో చెప్పుకున్నాడు కూడా. అంతే కాదు వీళ్లిద్దరు రెండు జనరేషన్ యువకులకు ఆదర్శంగా కూడా నిలిచారు. కష్టపడే తత్త్వం ఉంటే ఏ రంగం లో ఉన్నా సరే రాణించగలరు అని నిరూపించిన సెలబ్రిటీలు వీళ్ళే. అయితే ఈమధ్య కాలంలో ఈ ఇద్దరి హీరోల మధ్య విబేధాలు ఏమైనా వచ్చాయా?, ఇద్దరి మధ్య దూరం పెరిగిందా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
ఎందుకంటే రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘మాస్ జాతర’ చిత్రం లో నేపాటిజం పై, బ్లడ్ బ్యాంకు పై సెటైర్లు వేసాడు. ఇది చిరంజీవి ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలా?, లేదంటే సినిమా కంటెంట్ కి తగ్గట్టు పెట్టిన డైలాగ్స్ నా? అనేది పక్కన పెడితే, మెగా ఫ్యాన్స్ మాత్రం బాగానే ట్రిగ్గర్ అయ్యారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నటించారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఇక్కడ హాట్ టాపిక్ గా మారిన అంశం ఏమిటంటే, ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలబడడమే. ఏ తేదీన వస్తుంది అనేది తెలియదు కానీ, సంక్రాంతికి మాత్రం కచ్చితంగా వస్తున్నట్టు నేడు ఖరారు చేశారు.
సంక్రాంతికి ఇప్పటికే ప్రభాస్ రాజా సాబ్ చిత్రం తో జనవరి 9న రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12 న విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ అనే చిత్రం కూడా విడుదల కాబోతోంది. వీటి మధ్యలో ఇప్పుడు రవితేజ కూడా దూరిపోయాడు. ఆయన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం కూడా జనవరి 12 నే విడుదల చేయాలనీ ప్రయత్నం చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్. చిరంజీవి సినిమా విడుదలయ్యే రోజునే ఎందుకు తన సినిమాని కూడా రవితేజ విడుదల చేయాలనీ అనుకుంటున్నాడు?, జనవరి 13 న విడుదల చేసుకోవచ్చు కదా?, కావాలని చిరంజీవి ని టార్గెట్ చేస్తున్నారా?, అంత అవసరం ఏమిటి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.