Jr NTR early career rivals: సినిమా ఇండస్ట్రీలో వాళ్లకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. 2000 సంవత్సరంలో నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత చేసిన సినిమాలతో మంచి విజయాలను సాధించాడు. నిన్ను చూడాలని సినిమా ప్లాప్ అయినప్పటికి ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాతో చాలెంజింగ్ క్యారెక్టర్లను చేస్తూ ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం చేస్తు వస్తున్నాడు…ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా మారడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తను ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న డ్రాగన్ సినిమా కోసం ఇప్పటిదాకా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఎన్టీఆర్ కెరియర్ స్టార్టింగ్ లో చాలా గొప్ప సినిమాలు చేస్తున్నప్పుడు చాలామంది హీరోలు తనకి పోటీని ఇచ్చారు.
ఉదయ్ కిరణ్, నితిన్,సుమంత్ మహేష్ బాబు లాంటి హీరోలు తనతో పోటీ పడ్డారు. వాళ్ళందరూ తనకి గట్టి పోటీ ఇచ్చినప్పటికి వరుస సినిమాలు చేసి వాళ్ళందరిని తట్టుకొని స్టార్ హీరోగా ఎదిగాడు…ఇక వాళ్లలో మహేష్ బాబు ఒక్కడే ఎన్టీఆర్ తో పాటు పోటీపడి నిలబడి ప్రస్తుతం టాప్ హీరోగా ఎదిగాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ 6 హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఇద్దరు ఉండటం విశేషం…ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికి డ్రాగన్ సినిమాతో మరోసారి సూపర్ సక్సెస్ గా సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమా చేసిన కూడా జూనియర్ ఎన్టీఆర్ డిఫరెంట్ సినిమాలను చేస్తున్నాడు. అయినప్పటికి తనకు భారీ సక్సెస్ మాత్రం రావడం లేదు. ఇక మీదట తన నుంచి వచ్చే సినిమాలను చేస్తే బాగుంటుందని అతని అభిమానులు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా మీద ప్రతి ఒక్కరికి భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…