Rakhi Sawant : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో విషయం వివాదాస్పదం అవుతూనే ఉంటుంది. ఇక సెలబ్రిటీలు కొందరు పెళ్లి చేసుకొని రెండు మూడు సంవత్సరాలు కలిసి ఉండి ఆ తర్వాత విడాకులు తీసుకుంటారు. మరికొందరు పెళ్లి జరిగిన కొన్ని రోజులకే విడాకులు తీసుకుంటారు. కానీ కొందరు ఏళ్లు గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకుంటారు. ఇక మరీ ముఖ్యంగా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా?
వినోద పరిశ్రమలోని అత్యంత వివాదాస్పద వ్యక్తులలో ఒకరైన రాఖీ సావంత్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కొన్నిసార్లు పెళ్లి గురించి, కొన్నిసార్లు విడాకుల గురించి, కొన్నిసార్లు తన ప్రకటనల గురించి వైరల్ అవుతుంటారు. ప్రస్తుతం ఈ నటి పాకిస్థాన్‌లో ఉంది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక పెద్ద వార్త బయటకు వచ్చింది. ఇక ఈ విషయం వింటే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాఖీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఈమె ఇప్పటి వరకు రెండు పెళ్లిళ్లు చేసుకుంది.
ఆమె మొదటి వివాహం 2019లో రితేష్ సింగ్‌తో జరిగింది. వారిద్దరూ 2022లో విడాకులు తీసుకున్నారు. దీని తరువాత, ఆమె అదే సంవత్సరంలో ఆదిల్ ఖాన్ దుర్రానీని రెండవసారి వివాహం చేసుకుంది. అయితే వారిద్దరూ 2023లో విడాకులు తీసుకున్నారు. అంతేకాదు వీరి పెళ్లి, విడాకుల విషయంలోనూ చాలా వివాదాలు నడిచాయి. దీని తరువాత, ఇప్పుడు ఆమె మూడవ వివాహం గురించి వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె తన మూడవ వివాహం భారతదేశంలో కాకుండా పాకిస్తాన్‌లో చేసుకోవాలి అనుకుంటుందట. దాని గురించి ఆమె ఒక సూచన కూడా ఇచ్చింది.
మీడియా నివేదికల ప్రకారం, పాకిస్థానీ నటుడు-నిర్మాత డోడి ఖాన్ పెళ్లికి రాఖీని ప్రతిపాదించాడట. దీంతో రాఖీ, డోడితో పెళ్లి పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తాను పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్నట్లు రాఖీ తెలిపింది. తాను దోడి పెళ్లి ప్రతిపాదనను కూడా పరిశీలించవచ్చని, పాకిస్థాన్‌కి కోడలు కావాలని ఆలోచిస్తున్నానని చెప్పింది. రాఖీ, ‘అవును, నేను లాహోర్‌కు వచ్చిన మాట వాస్తవమే. హనియాకు అమీర్‌తో కాస్త పని ఉంది. అందుకే ఇక్కడికి వచ్చాను అంటూ తెలిపింది.
రాఖీ పాకిస్థాన్ కోడలు కానుందా?
ఆమె ఇంకా మాట్లాడుతూ, ‘నేను పాకిస్తాన్‌కు చేరుకున్నానని ప్రజలు చూసినప్పుడు, నాకు మంచి స్నేహితుడైన దోడీ జీ నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. అతని ప్రపోజల్ నాకు బాగా నచ్చి ఇప్పుడు పాకిస్తాన్ కి కోడలు కావాలని ఆలోచిస్తున్నాను. అదే మీకు కూడా తెలియజేస్తున్నాను అని పేర్కొంది. అయితే దోడి ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో అతను రాఖీని సరదాగా ఓ ప్రశ్న వేస్తాడు. మీరు పెళ్లి ఊరేగింపుతో భారతదేశానికి రావాలనుకుంటున్నారా? లేదా దుబాయ్‌కి రావాలనుకుంటున్నారా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అంటూ ఆ వీడియోలో ఉంది. ఈ వీడియో తర్వాత రాఖీ మూడో పెళ్లిపై చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై రాఖీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి చూడాలి ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకొని అభిమానులకు షాక్ ను ఇస్తుందో..
View this post on Instagram
View this post on Instagram