https://oktelugu.com/

Pushpa: ‘పుష్ప’కు అన్ని కోట్లు పెట్టినా క్వాలిటీ ఎక్కడా కనిపించిందే లే?

Pushpa:స్టైలిస్ట్​ స్టార్​ అల్లు అర్జున్​ నటించిన పుష్ప సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3వేలకుపైగా థయేటర్లలో రిలీజ్​ అయిన ఈ సినిమా.. పలు చోట్ల మిక్స్​డ్​ టాక్​ అందుకుంటోంది. వసూళ్ల పరంగా తొలి రోజు భారీ కలెక్షన్లు కురిపించినా.. సినిమాలో కొన్ని సాంకేతిక లోపాలు స్పష్టంగా కనిపించాయనన్నది వినిపిస్తోన్నటాక్​. ఈ సినిమాను దాదాపు 180 కోట్లు పెట్టి నిర్మించారు. నిజానికి అంత భారీ బడ్జెట్​తో తీసిన సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గేదే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 05:07 PM IST
    Follow us on

    Pushpa:స్టైలిస్ట్​ స్టార్​ అల్లు అర్జున్​ నటించిన పుష్ప సినిమా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 3వేలకుపైగా థయేటర్లలో రిలీజ్​ అయిన ఈ సినిమా.. పలు చోట్ల మిక్స్​డ్​ టాక్​ అందుకుంటోంది. వసూళ్ల పరంగా తొలి రోజు భారీ కలెక్షన్లు కురిపించినా.. సినిమాలో కొన్ని సాంకేతిక లోపాలు స్పష్టంగా కనిపించాయనన్నది వినిపిస్తోన్నటాక్​. ఈ సినిమాను దాదాపు 180 కోట్లు పెట్టి నిర్మించారు. నిజానికి అంత భారీ బడ్జెట్​తో తీసిన సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గేదే లే అన్నట్లు ఉండాలి. దానికి తోడు, ఇప్పటి వరకు సుకుమార్​ తీసిన ఓ సినిమాలోనూ సాంకేతికంగా ఎక్కడా లోపాలు కనిపించవు. వన్​, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, వంటి సినిమాలను గమనిస్తే విజువల్​ వండర్​తో పాటు ఆడియో మ్యాజిక్​ క్లియర్​గా కనిపిస్తుంది.  కాగా, బన్నీ- సుక్కు కాంబోలో మూడో సినిమా కావడం విశేషం.

    Pushpa

    Also Read: ‘పుష్ప’ వ్యాన్​లో రొమాన్స్ సీన్​ డిలీట్​.. కారణం అదేనట?

    అయితే, పుష్పలో సుకుమార్​ నుంచి ఆశించే ఆ టెక్నికల్​ క్వాలిటీ చాలా వీక్​ అయ్యిందనేది బయట టాక్​ నడుస్తోంది. డీఎస్పీ వంటి టాప్​ మ్యూజిక్ డైరెక్టర్​, సౌండ్​ డిజైనర్​ రసూల్​ పూకుట్టి, సినిమాటోగ్రాఫర్​ మిస్లోవ్​ కూబా వంటి దిగ్గజాలతో పని చేయించుకుని కూడా మంచి అవుట్​పుట్​ తేలేకపోయాడనేది వినిపిస్తున్న వాదన. నిజానికి నిర్మాతలు ఎక్కడా ఖర్చు విషయంలో రాజీ పడలేదని అర్థమవుతోంది. అయితే, అందుకు తగ్గ క్వాలిటీ మిస్​ అయ్యిందనేది వినిపిస్తోన్న అభిప్రాయం. ఎడిటింగ్​  కూడా పెద్దగా ఏం లేదని అంటున్నారు. సినిమా కాస్త ల్యాగ్​ అయ్యిందని.. కానీ, ఏదో జరుగుతోందనే ఆశే థియేటర్లలో కూర్చోబెట్టిందని అంటున్నారు.

    ఈ సినిమా రెెండు భాగాలుగాతెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే, తొలి పార్ట్​ను హడావిడిగా జనాల్లోకి తీసుకెళ్లాలని పనులను పూర్తి చేయడం వల్లే ఇలా జరిగిందంటున్నారు. మరి తర్వాత పార్ట్​లోనైనా ఈ తప్పు జరగకుండా చూసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

    Also Read: 2021లో తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాలివే..!