HomeNewsPushpa 2 Teaser: ఆరు నిమిషాలకు.. 60 కోట్లు

Pushpa 2 Teaser: ఆరు నిమిషాలకు.. 60 కోట్లు

Pushpa 2 Teaser: పుష్ప – 2 సినిమా కు సంబంధించి రోజుకో కీలక విషయం బయటకు వస్తోంది. ఈ సినిమా విడుదలకు నాలుగు నెలల సమయం ఉంది.. అయినప్పటికీ ప్రేక్షకులకు నాణ్యమైన సినిమాను అందించాలనే ఉద్దేశంతో చిత్ర నిర్మాతలు, దర్శకుడు సుకుమార్, కథానాయకుడు అల్లు అర్జున్ నిర్మాణ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఇటీవల అల్లు అర్జున్ జన్మదినాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన గంగమ్మ జాతర ఎపిసోడ్ టీజర్ ఆకట్టుకుంటుంది అల్లు అర్జున్ అవతారం ప్రేక్షకులతో విజిల్ వేయించింది. గతంలోనే ఈ చిత్ర నిర్మాతలు అల్లు అర్జున్ గంగమ్మ అవతారాన్ని పోస్టర్ రూపంలో విడుదల చేశారు. ఇటీవల గంగమ్మ వేషాన్ని టీజర్ రూపంలో బయటికి వదిలారు. అది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా.. అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ ను మరింత పెంచింది.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో గంగమ్మ జాతరకు సంబంధించిన టీజర్ గురించి చర్చ నడుస్తోంది. అయితే ఈ గంగమ్మ జాతర సందర్భంగా వచ్చే పాట, సన్నివేశం పుష్ప-2 సినిమాలో ఆరు నిమిషాల పాటు ఉంటుందని, ఇది ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. ఆరు నిమిషాల సన్నివేశానికి అయిన ఖర్చు దాదాపు 60 కోట్లట. ఈ సన్నివేశాన్ని సుకుమార్ అత్యద్భుతంగా చిత్రీకరించారని చిత్ర యూనిట్ చెబుతోంది. కేవలం సన్నివేశం మాత్రమే కాదు ఇందులో ఒక పాట కూడా ఉంటుందని.. ఈ చిత్రీకరణను సుమారు నెల రోజుల సమయంలో పూర్తి చేశారని తెలుస్తోంది. సినిమాలో ఈ సన్నివేశానికి, పాటకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని.. అందుకే సుకుమార్ అత్యంత కష్టపడి తీస్తున్నారని తెలుస్తోంది. ఈ సన్నివేశానికి ఉన్న అంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే భారీగా ఖర్చు పెడుతున్నారని అంటున్నారు. పుష్ప- 1 లో నటించిన అందుకే అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను మరింత ఉన్నతంగా తీర్చి దిద్దుతున్నారు. అందు గురించే సినిమాకు సంబంధించి రోజుకో కొత్త విషయాన్ని బయటకి వదులుతున్నారు.

గతంలో పుష్ప-2 కు సంబంధించి విడుదల తేదీ విషయంలో రకరకాల ప్రకటనలు వినిపించాయి. కొందరు ఆగస్టు 15న విడుదలవుతుందని.. మరికొందరు ఆ సమయానికి విడుదల కాకపోవచ్చు అని.. వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలైన సందర్భంగా ఆగస్టు 15న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని.. నిర్మాతలు ప్రకటించడంతో ఆ పుకార్లకు చెక్ పడినట్టయింది. ఇక ఈ సినిమాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు ఉంటాయని.. అన్నీ కుదిరితే పార్ట్ -3 కూడా ఉంటుందని సమాచారం. అందువల్లే పుష్ప-2 సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇవి ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాపై కేవలం తెలుగు పరిశ్రమమే కాదు.. దక్షిణాది ప్రాంతానికి చెందిన చిత్ర పరిశ్రమలు.. ఉత్తర భారతదేశానికి చెందిన హిందీ చిత్ర పరిశ్రమ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రష్మిక కథానాయకగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular