Homeప్రవాస భారతీయులుTrump Green Card Holders Shock: గ్రీన్‌కార్డు హోల్డర్లకు ట్రంప్‌ షాక్‌.. అమెరికా పౌరసత్వ మరింత...

Trump Green Card Holders Shock: గ్రీన్‌కార్డు హోల్డర్లకు ట్రంప్‌ షాక్‌.. అమెరికా పౌరసత్వ మరింత ఖరీదు

Trump Green Card Holders Shock: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం తీసుకున్నారు. ఏ పని చేసినా అమెరికా ఫస్ట్‌ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే దేశంలోకి వచ్చే విదేశీయులకు ఇచ్చే హెచ్‌–1బీ వీసా నిబంధనలు కఠినం చేశారు. తాజాగా స్టూడెంట్‌ వీసా పరిమితిని నాలుగేళ్లకు తగ్గించారు. తాజాగా అమెరికా పౌరసత్వాన్ని మరింత ఖరీదు చేశారు. యునైటెడ్‌ స్టేట్స్‌ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్న విదేశీయులకు పెద్ద ఆందోళన కలిగించే నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ దరఖాస్తు రుసుములను ఏకంగా 75 శాతం వరకు పెంచాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఈ మార్పులు చట్టబద్ధమైన పౌరసత్వ ప్రక్రియను మరింత కష్టతరం చేసేందుకు ఉద్దేశించినవని అధికారులు చెబుతున్నారు.

ఫీజు పెంపు వివరాలు…
యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ విడుదల చేసిన ముసాయిదా ప్రకారం, సాధారణ పేపర్‌ దరఖాస్తు (ఫామ్‌ ఎన్‌–400) రుసుము ప్రస్తుతం 760 డాలర్ల నుంచి 1,330 డాలర్లకు పెరగనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు రుసుము కూడా 710 డాలర్ల నుంచి 1,280 డాలర్లకు పెరుగుతుంది. అప్పీల్‌ కోసం సమర్పించే ఫామ్‌ ఎన్‌–336 రుసుము 830 డాలర్ల నుంచి 1,475 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ మార్పుల వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే, దరఖాస్తులను పరిశీలించడం, ధృవీకరించడం వంటి మొత్తం ఖర్చును దరఖాస్తుదారుల నుంచే వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఫీజు మినహాయింపులు పూర్తిగా రద్దు
ఇప్పటివరకు తక్కువ ఆదాయం ఉన్నవారికి, ప్రభుత్వ సాయం పొందుతున్నవారికి అందుబాటులో ఉన్న ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని కొత్త నిబంధనలు పూర్తిగా తొలగించనున్నాయి. అదేవిధంగా, ఫెడరల్‌ పేదరిక ప్రమాణాలకు లోబడి ఉన్నవారికి ఇచ్చే 380 డాలర్ల తగ్గింపు రుసుము కూడా ఇకపై లభించదు. ఉచితంగా లేదా తక్కువ రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం వల్ల అనర్హులు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ వాదిస్తోంది. అయితే, అమెరికా సాయుధ దళాల్లో పనిచేస్తున్న సైనికులకు మాత్రం ఈ రుసుము మినహాయింపు కొనసాగుతుంది.

ఎప్పటి నుంచి అమలు?
ఈ ప్రతిపాదిత మార్పులు వెంటనే అమల్లోకి రావు. ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయడానికి 60 రోజుల సమయం ఇచ్చారు. ఆ తర్వాతే తుది నిర్ణయం వెల్లడవుతుంది. ఇటీవల గ్రీన్‌ కార్డ్‌ దరఖాస్తుదారులు తమ స్వదేశాల్లోనే ప్రక్రియ పూర్తి చేయాలని జారీ చేసిన మెమో ఇప్పటికే వలసదారులను ఆందోళనలోకి నెట్టిన నేపథ్యంలో, ఈ ఫీజు పెంపు ప్రతిపాదన మరింత ఆందోళన కలిగిస్తోంది.

అమెరికా చాలా కాలంగా వలసలను ప్రోత్సహించే దేశంగా ఉండేది. ప్రస్తుతం అదే దేశం చట్టబద్ధమైన వలస ప్రక్రియను కఠినతరం చేస్తూ, ఆర్థిక భారాన్ని పెంచుతూ ఉండటం నిపుణులు విమర్శిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులపై ఈ మార్పులు అత్యధిక ప్రభావం చూపనున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version