HomeNewsPudina: పుదీనా ఔషధాల ఖజానా.. ఎన్నో రోగాలు నయం !

Pudina: పుదీనా ఔషధాల ఖజానా.. ఎన్నో రోగాలు నయం !

Pudina: పుదీనా గురించి చాలామందికి సరైన అవగాహన లేదు. ఇప్పటికైనా పుదీనా ఔషధాల ఖజానా అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే.. పుదీనాలో విటమిన్‌ ఎ, సి, ఫోలేట్‌లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌ లాంటి ఎన్నో సూక్ష్మపోషకాలుంటాయి. పైగా యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పుదీనా రోగనిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది.

Pudina
Pudina

‘పుదీనా’ని నిమ్మరసం, పండ్ల రసాలు, మజ్జిగ, ఇలాంటి వాటితో కలిపి తాగితే మెరుగైన ఫలితాలను పొందొచ్చు. ఎందుకో తెలుసా ? పుదీనా ఆకుల్లో ఫినోలిక్‌ సమ్మేళనాలు మెండుగా ఉండటం వల్ల. అవి వివిధ రుగ్మతలను బాగా తగ్గిస్తాయి.

Also Read: చెరుకు రసం ఓ ఔషధం.. పైగా ఎన్నో ఉపయోగాలు !

మీకు తెలుసా ? కడుపులో మంట, ఉబ్బరాన్ని కూడా పుదీనా బాగా తగ్గిస్తుంది. పుదీనా ఆకులను తినడం వల్ల లాలా జలగ్రంథులు బాగా చురుగ్గా పనిచేస్తాయి. అప్పుడు జీర్ణప్రక్రియకు కావాల్సిన ఎంజైమ్‌ ల ఉత్పత్తి కూడా చాలా సజావుగా జరుగుతుంది. దాంతో ఆహారం చక్కగా జీర్ణమవుతుంది.

ఒకవేళ మీరు ‘పుదీనా’ను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే ఇక మీకు జీవితంలో మలబద్ధకం సమస్య రాదు.

పైగా పుదీనా తైలం తలనొప్పిని, చికాకుని కూడా బాగా తగ్గిస్తుంది. అందుకే, పుదీనా నూనె, ఆకుల సువాసనను ఎక్కువగా ఆస్వాదించండి. అలా చేస్తే.. మీకు అలసట, ఆందోళన, ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతాయి. అన్నిటికీ మించి పుదీనా మన మెదడును బాగా ఉత్తేజంగా ఉంచుతుంది. అలాగే దగ్గు, గొంతు నొప్పులతో బాధపడేవారు కప్పు పుదీనా టీ తీసుకున్నా చాలు, వెంటనే ఉపశమనం లభిస్తుంది.

ఇక గర్భిణుల్లో సాధారణంగా కనిపించే మార్నింగ్‌ సిక్‌ నెస్‌ ను పుదీనా బాగా తగ్గిస్తుంది. మజ్జిగలో పుదీనా ఆకులను వేసుకుని తాగితే.. వికారం, వాంతుల నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.

Also Read: భోజనం చేసిన తర్వాత ఈ తప్పులు చేస్తున్నారా.. ప్రాణాలకే ప్రమాదమట!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

2 COMMENTS

  1. […] Nagarjuna: అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ బంగార్రాజు సినిమా సంక్రాంతి రేసులో ఉంది. అయితే. ఈ సినిమాలో నాగ్ డబుల్ రోల్ చేసాని.. తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. బంగార్రాజులో తాతగా అలాగే కొడుకుగా నాగ్ నటించాడట. ఇక మనవడుగా చైతన్య కనిపిస్తున్నాడు. అయితే, సెకండ్ హాఫ్ లో తండ్రి క్యారెక్టర్ వస్తోందట. మరి ఫస్ట్ పార్ట్ లో తల్లిగా లావణ్య త్రిపాఠీ నటించింది. కాకపోతే, ఆమె క్యారెక్టర్ ను ఎండ్ చేసేశారు. ఆమెను బంగార్రాజులో చూపించడం లేదు. […]

  2. […] UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు అధికార పార్టీ బీజేపీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో బీజేపీ తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ రాష్ర్టంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. వ్యూహాలు ఖరారు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను ఢీకొనేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. ఎదుటి పార్టీలను దాటుకుని విజయం సాధించాలంటే పలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసమే యోగి శక్తియుక్తులు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular