Tollywood Star Heroes: తెలుగు తెర పై ప్రస్తుతం మల్టీస్టారర్ చిత్రాలు ఓ వెలుగు వెలిగిపోతున్నాయి. అయితే, నిజానికి ఈ పద్దతి కొత్తది కాదు, అప్పటి నుంచో ఉంది. కాకపోతే నేటి ప్రేక్షకులకు అంతగా తెలియదు. మీకు తెలుసా ? కొన్ని ఆశ్చర్యకరమైన అతిథి పాత్రలను మన స్టార్లు వేరే స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మెప్పించారు. మరి ఆ సినిమాల లిస్ట్ ఏమిటో చూద్దామా ?

అతిథి పాత్రల్లో ఆశ్చర్య పరిచిన స్టార్ల లిస్ట్ ఇదే.
అది 1998 వ సంవత్సరం.. నాగార్జున హీరోగా వచ్చిన “చంద్రలేఖ” సినిమాలో ప్రముఖ హిందీ స్టార్ హీరో సంజయ్ దత్ అతిథి పాత్రలో కనపడి అందరికి షాక్ ఇచ్చాడు. ఉన్న 2 నిమిషాలు భలే నవ్వించాడు కూడా. బహుశా చాలా మందికి ఇది తెలియదు.

ఇక 2004లో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా నాని. ఈ సినిమాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అతిధి పాత్రలో మెరిశారు. ఈయన మహేష్ కి బావగారు అవుతారు.

2004 లో వచ్చిన “ఆనంద్” చిత్రంలో ప్రముఖ చిత్ర దర్శకుడు “శేఖర్ కమ్ముల” ఆటో డ్రైవర్ గా కొద్దిసేపు కనిపిస్తారు. పైగా ఆ చిత్రానికి శేఖర్ కమ్ములనే డైరెక్టర్.

ఇదే కోవలో ప్రముఖ దర్శకులు రాజమౌళి కూడా 2004లో వచ్చిన సై సినిమాలో కూడా మెరిశారు. అలాగే 2015లో వచ్చిన బాహుబలి చిత్రంలో కూడా ఆయన అతిధిగా ప్రేక్షకులని అలరించారు.
Also Read: ‘పుష్ప’ పై సినీ ప్రముఖుల అతి ప్రేమ !

2007లో వచ్చిన దుబాయ్ శీనులో దర్శకులు శ్రీను వైట్ల కూడా కొద్దీసేపు కనిపించి అలరించారు.
