https://oktelugu.com/

పవర్ స్టార్ బర్త్ డే రెండో గిప్ట్.. #PSPK27 ప్రీ లుక్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక.. వరుసబెట్టి సినిమాలకు కమిట్ అయ్యారు. పవన్ రీ ఎంట్రీ మూవీగా దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్’ రాబోతున్న సంగతి తెల్సిందే. బాలీవుడ్లో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ మూవీ తెలుగులో ‘వకీల్ సాబ్’ రాబోతుండటంతో ఈ సినిమా భారీ హిట్టు సాధించడం ఖాయంగా కన్పిస్తోంది. ఇందులో పవన్ తొలిసారి క్రిమినల్ లాయర్ గా కన్పిస్తుండటంతో అభిమానులు ఈ మూవీ కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ బర్త్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2020 / 02:28 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక.. వరుసబెట్టి సినిమాలకు కమిట్ అయ్యారు. పవన్ రీ ఎంట్రీ మూవీగా దిల్ రాజు నిర్మాణంలో ‘వకీల్ సాబ్’ రాబోతున్న సంగతి తెల్సిందే. బాలీవుడ్లో సూపర్ హిట్ సాధించిన ‘పింక్’ మూవీ తెలుగులో ‘వకీల్ సాబ్’ రాబోతుండటంతో ఈ సినిమా భారీ హిట్టు సాధించడం ఖాయంగా కన్పిస్తోంది. ఇందులో పవన్ తొలిసారి క్రిమినల్ లాయర్ గా కన్పిస్తుండటంతో అభిమానులు ఈ మూవీ కోసం అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

    పవన్ బర్త్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ చిత్రయూనిట్ ఇప్పటికే అభిమానులకు అదిరిపోయే కానుక ఇచ్చింది. ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ మోషన్ పోస్టర్ ట్రెండింగులో దూసుకెళుతోంది. దీంతో అభిమానులంతా ఖుషీ అవుతున్నారు. అదేవిధంగా డైరెక్టర్ క్రిష్ కూడా పవన్ కల్యాణ్ తో చేయబోతున్న మూవీకి సంబంధించిన ప్రీ లుక్ తాజాగా రిలీజ్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు.

    పవన్-క్రిష్ కాంబోలో ఓ పీరియాడికల్ మూవీ రాబోతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. పవన్ కల్యాణ్ తో ‘ఖుషీ’ చిత్రాన్ని నిర్మించిన ఎఎం రత్నం ఈ మూవీని నిర్మించబోతున్నారు. ఖుషీ సినిమా టైంలోనే పవన్ ఆయనతో మరో సినిమా చేస్తాడని హామీ ఇచ్చాడు. దీంతోనే ఈ సినిమా ఇటీవల తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్లో ఎఎం రత్నం ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

    పవన్ కల్యాణ్ 27వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి షెడ్యూల్ ఇప్పటికే పూర్తయింది. కరోనా కారణంగా అన్ని సినిమాలతోపాటు ఈ మూవీ షూటింగ్ కూడా నిలిచింది. నేడు పవన్ పుట్టినరోజును పురస్కరించుకొని చిత్రబృందం ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటివరకు పవన్ తన కెరీర్లో చేయనటువంటి కొత్త గెటప్ లో దర్శకుడు క్రిష్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ముఖాన్ని చూపించకుండానే.. ధీరత్వంతో నడుము మీద చేయి వేసుకుని నిలబడినట్లు చూపించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ క్రిష్ తోపాటు చిత్రబృందం పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

    పీరియాడికల్ మూవీ తెరకెక్కుతున్న ఈమూవీలో పవన్ వజ్రాల దొంగగా కన్పించనున్నాడనే టాక్ విన్పిస్తోంది. మొగల్ సామ్రాజ్య కథాంశంతో మూవీ నాటి పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించేందుకు దర్శకుడు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రాక నేపథ్యం ఉన్న సినిమాలు తీసి సత్తాచాటాడు. ఈనేపథ్యంలో పవన్-క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్.. రామ్-లక్ష్మణ్ యాక్షన్ సీక్వెల్స్ చేస్తున్నారు.