ఒక్క లేడీ.. 139 మంది రేపిస్టులు.. 5 వేల సార్లకు పైగా అత్యాచారం.. కొద్ది రోజులుగా ఇది తెలంగాణ రాష్ట్రంలో సెన్సేషనల్ వినిపిస్తోంది. తనపై ఇంత మంది ఇన్నిసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ స్వయంగా ఓ గిరిజన యువతే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందులో ప్రముఖ టీవీ యాంకర్, నటుడు , మా మాజీ ఎంపీ పీఏ కూడా ఉన్నట్లు అందరి పేర్లు, ఫోన్ నంబర్లతో సహా కంప్లైట్ ఇచ్చింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రజాసంఘాలు, గిరిజన సంఘాలు, పార్టీలు ఆ యువతికి న్యాయం చేయాలంటూ ఆందోళనలకు దిగాయి. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కేసులో కొత్తకొత్త ట్విస్టులు పుట్టుకొస్తున్నాయి.
139 మందితోపాటు వాళ్ల ఫ్రెండ్స్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసిన గిరిజన యువతి.. రెండు రోజుల క్రితం కుల సంఘాలతో కలిసి మీడియా ముందుకొచ్చింది. తనపై అఘాయిత్యం చేసింది 139 మంది కాదని.. కేవలం 39 మందే అంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా డాలర్ బాబు అలియాస్ శ్రీకర్‌రెడ్డి చేయమంటే చేశానని అంది. అలా చేయకుంటే తన కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించినట్లు వాపోయింది. అందుకే ఈ కేసులో సంబంధం లేని వారి పేర్లు కూడా ఇరికించినట్లు చెప్పుకొచ్చింది. దీంతో కేసు ఒక్కసారిగా మరో మలుపు తిరిగింది.
ప్రముఖ యాంకర్, నటుడికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తనను క్షమించాలని వేడుకుంది. దీంతో అప్పటివరకు ఆ యువతికి సపోర్టుగా నిలిచిన వారు కూడా ఒక్కసారిగా వెనక్కి తగ్గినట్లుగా కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న డాలర్ బాబు సోషల్ మీడియా వేదికగా మంగళవారం ఓ వీడియో రిలీజ్ చేయడం మరో ట్విస్ట్. తనపై వస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధాలేనని చెప్పుకొచ్చాడు. ఆ యువతే పలువురితో కలిసి తనను అపహరించేందుకు ప్రయత్నించిందంటూ వీడియో ద్వారా వివరించాడు. ఇదే విషయాన్ని ఓ పోలీసు అధికారికి చెప్పి.. ప్రస్తుతం తాను ఓ సేఫ్ ప్లేస్‌లో దాక్కున్నట్లు వెల్లడించాడు.
డాలర్ బాబు తాజా వీడియోలో తాను ఎక్కడికీ పారిపోలేదని.. పోలీసుల విచారణలో అన్ని నిజాలు వెలుగు చూస్తాయని అంటున్నాడు. ఎవరికైనా అనుమానాలు ఉంటే తన ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ ఖాతాలోని నగదు నిల్వలను కూడా చెక్ చేసుకోవచ్చని అన్నాడు. ఈ క్రమంలో పోలీసులకు ఈ కేసు అంతుపట్టకుండా మారిపోయింది. ఓవైపు యువతి చెబుతున్న మాటలు నమ్మాల్నా.. డాలర్ బాబు మీద నమ్మకం పెట్టుకోవాల్నో తెలియక తలలు పట్టుకుంటున్నారు. యువతి తన దగ్గర ఉన్న ఆధారాలతో సహా పోలీసులకు అప్పజెప్పినా.. తనకు ముప్పు ఉండడం వల్లే ఓ పోలీసు అధికారి సాయంతో తలదాచుకున్నట్లు డాలర్ బాబు చెబుతుండడంతో ఈ కేసు ఎటుదారి తీస్తుందో తెలియకుండా ఉంది.