రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై హైకోర్టులో మాతృభూమి ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. మద్యం అమ్మకాల విషయంలో లాక్ డౌన్ నిబంధనలు అమలు జరగడం లేదని, వైన్స్ షాపుల వద్ద భౌతికదూరం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ పిటిషన్ పేర్కొన్నారు. మరోవైపు మద్యం తాగడంతో రోగనిరోధక శక్తి తగ్గుతుందని పిటిషనర్ తరపు న్యామవాది వాదించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలని ప్రభుత్వం ఒకవైపు చెబుతూనే, మరోవైపు మద్యం అమ్మకాలకు అవకాశం ఇచ్చారని తెలిపారు.
Also Read: ఎల్జీ పాలిమర్స్ మీడియాను ఎందుకు అడ్డుకున్నారు!
మద్యనిషేధానికి ఈ అవకాశాన్ని ప్రభుత్వం వినియోగించుకోవాలని పిటిషనర్ సూచించారు. మద్యనిషేధం వెంటనే అమలు చేస్తామనలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. నాలుగేళ్లలో సంపూర్ణ మద్యనిషేధం చేస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి గురువారం వరకు హైకోర్టు సమయమిచ్చింది. తుదుపరి విచారణ శుక్రవారానికి కోర్టు వాయిదా వేసింది.