2022 Movie Updates: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, అటు రాజకీయాలను కూడా పవన్ హ్యాండిల్ చేస్తున్నాడు. కాగా 2023లో ఎన్నికల ఘంటారావం మోగనుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే, ఇక నుంచి సినిమాల వేగాన్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. ఇన్నాళ్లు సినిమా – రాజకీయం అంటూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్.. ఇక నుంచి రాజకీయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ఫిక్స్ అయ్యాడట. అందుకు తగిన ప్రణాళికలు వేసుకున్నాడట.

బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొణె పెళ్లి తర్వాత కూడా బోల్డ్ సీన్స్ లో మొహమాటం లేకుండా నటిస్తోంది. దీపికా పదుకొణె తాజాగా నటించిన కొత్త మూవీ ‘గెహ్రయిన్’. దీనిలో ఆమె నటించిన బోల్డ్ సీన్ కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకుంది. . సినిమాలోని ఆ బోల్డ్ సీన్ కోసం ఏకంగా 48 టేక్స్ తీసుకున్నానని, ఆ సీన్ తనను సెట్‌లో చాలా ఇబ్బంది పెట్టిందని ఆమె చెప్పింది. ఈ మూవీలో దీపిక-సిద్ధాంత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి లిప్‌లాక్ సీన్లతో దీపికా హీట్ పెంచేస్తోంది. ఫిబ్రవరి 11న ప్రైమ్‌లో సినిమా రిలీజ్ కానుంది.
Also Read: ఆ ఇద్దరి వల్లే నేనింకా బ్రతికి ఉన్నాను – సమంత

ఇక మరో క్రేజీ అప్ డేట్ విషయానికి వస్తే.. హీరో నాగశౌర్య కొత్త సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. కాగా ఈ సరికొత్త మూవీలో వెరైటీ లుక్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు శౌర్య. అందుకోసం ప్రత్యేకంగా మేకప్ చేయించుకోబోతున్నాడు. ఇక నిన్న విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శౌర్య ట్రెడిషనల్ లుక్‌లో అదరగొట్టాడు. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ లుక్ కూడా ఈ సినిమాలో ఉంటుందట. కృష్ణ వృంద ప్రేమ కథగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: ఆ నటి కన్నీళ్లు ప్రేక్షకులను కదిలించాయి !.