మనం ఎన్ని చోట్లకు వెళ్లిన, ఎంత దూరం ప్రయాణించిన చివరకు చేరుకునేది ఇంటి వద్దకే. మన ఇల్లు మనకు ఒక రక్షణ లాంటిది. అలాంటి ఇంటిని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయరాదు. అందుకే.. ఇల్లు కట్టేటప్పుడు కూడా వాస్తు శాస్త్రాలను చూస్తూ ఉంటాం. అలా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడమే కాదు ఇంటి లోపల వాతావరణం కూడా శుభ్రంగా ఉండాలి.
ఇల్లు నిత్యం శుభ్రంగా ఉండడం వల్ల ఆర్థికంగా, ఆరోగ్యంగా బలంగా ఉంటుంది. కానీ ఇల్లుని శుభ్రపరచడంలో కూడా ఒక సమయం అనేది ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు ఊడవకూడదని కొన్ని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఊడ్చటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తుంది. అవేంటో తెలుసుకుందాం.
బ్రహ్మముహూర్తం లేదా సూర్యాస్తమయ సమయంలో ఇంటిని అసలు శుభ్రపరచకూడదు. ఈ సమయాలు దాటిన తర్వాత మాత్రమే ఊడ్చాలి. లేదా ఆ సమయంలో ఊడ్చినట్లయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇక రాత్రిపూట కూడా అసలు ఇంటిని ఊడ్చకూడదు. ఒకవేళ ఊడ్చిన ఆ చెత్తను మరుసటి రోజు బయట పడేయాలి.
ఇక ఇంట్లో సాలె గూళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా నాలుగు మూలలలో చెత్త ఉండకుండా చూసుకోవాలి. టాయిలెట్ లను ప్రతి రోజూ శుభ్రం చేస్తూ ఉండాలి. వారానికొకసారి సముద్రపు ఉప్పు తో ఇంటిని తూడ్చాలి. ఇంట్లో పనికిరాని వస్తువులను వెంటనే తొలగించాలి. అంతే కాని వాటిని వాడకూడదు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు ఎదురౌతాయి.