
Pawan Kalyan Son Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుండో ఆయన కొడుకు అకిరా నందన్ సినీ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ కటౌట్ తో తండ్రికి మించిన అందంతో పెద్ద సూపర్ స్టార్ అవ్వడానికి అన్నీ విధాలుగా అర్హత ఉన్న అకిరా నందన్ ఎదో ఒకరోజు గ్రాండ్ గా డెబ్యూ ఇస్తాడని ఆశించారు ఫ్యాన్స్. కానీ ఆయన అమ్మ రేణు దేశాయ్ మాత్రం అకిరా కి సినిమాల మీద కంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఇష్టం అని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఎన్నోసార్లు చెప్పింది.
అయితే ఫ్యాన్స్ ఇప్పుడు అలాగే అనుకుంటారు, పవన్ కళ్యాణ్ కూడా మొదట్లో డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీ కి వచ్చాడు,కానీ కాలం ఆయనని హీరోగా మార్చింది. కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది, అకిరా నందన్ పరిస్థితి కూడా ఇంతే,కచ్చితంగా ఆయన సినిమాల్లోకి వస్తాడు అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేసేవారు.

కానీ ఆయన ఈరోజు అభిమానులకు దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. కార్తికేయ యార్లగడ్డ అనే ఒక యూట్యూబర్ ‘రైటర్స్ బ్లాక్ ‘ అనే షార్ట్ ఫిలిం ని చేసాడు, ఈ షార్ట్ ఫిలిం కి అకిరా నందన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఆ వీడియో ని మీరు క్రింద చూడవచ్చు.నిన్న గాక మొన్న మ్యూజిక్ నేర్చుకున్న అకిరా నందన్ ఇంత అద్భుతంగా మ్యూజిక్ ఇస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
కేవలం మ్యూజిక్ లో మాత్రమే కాదు,కరాటీ లో మరియు ఇతర క్రాఫ్ట్స్ లో కూడా అకిరా నందన్ కి మంచి పట్టు ఉంది. ఇతను సినీ రంగం లోకి అడుగుపెడితే మ్యూజిక్ డైరెక్టర్ గా సౌత్ లోనే టాప్ కి వెళ్లగలడు,అలాగే హీరో గా ఎంట్రీ ఇస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగానే తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించగలడు. మరి అభిమానుల కోరికకి తగ్గట్టుగా అకిరా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.