
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల థర్డ వేవ్ కరోనా ప్రారంభమైందని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే కరోనా విజృంభించడంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ వార్తలపై ఢిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ వస్తున్న పుకార్లను నమ్మొద్దన్నారు. ఢిల్లీలో తిరిగి లాక్ డౌన్ విధించడం లేదన్నారు. లాక్ డౌన్ విధించడమనేది సరైన చర్యగా మేం భావించడం లేదని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడమే సరైనదని భావిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతున్నందున లాక్ డౌన్ ప్రకటించే అవకాశమే లేదన్నారు.