
క్రికెట్ బంతి అనుకొని నాటుబాంబుతో ఆడుకొన్న విద్యార్థి అది పేలి మృతి చెందాడు. కర్నూలు జిల్లా అవుకు మండలం చెన్నంపల్లిలో కొందరు నాటు బాంబులను దాచారు. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న వర కుమార్ వాటిని క్రికెట్ బంతులని ఆడుకున్నాడు. దీంతో ఆ బాంబు పేలి కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. అయితే నాటు బాంబులు అక్కడ ఉంచిన వారిని కఠినంగా శిక్షించాలని కుమార్ తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాటుబాంబులపై విచారణ చేపడుతున్నారు.