https://oktelugu.com/

Acharya Movie: ఆచార్య మూవీ పై ఇంత పగ ఎందుకు.. కారణం అదేనా?

Acharya Movie: ఒక్క హీరో కి అభిమానులు మరియు దురాభిమానులు ఉండడం సర్వసాధారణం..చిరంజీవి మరియు బాలకృష్ణ శకం నడుస్తున్న సమయం లో సోషల్ మీడియా అంతగా ఉండేది కాదు కాబట్టి వాళ్ళ అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ మనం ప్రత్యక్షంగా చూడలేకపోయాము..కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెగా మరియు నందమూరి ఫాన్స్ మధ్య ఎలాంటి పోరు అప్పట్లో ఉండేదో అర్థం అయ్యేలా చేసింది..ఇక ఇటీవల విడుదల అయినా ఆచార్య సినిమా పై నందమూరి అభిమానులు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 1, 2022 / 06:32 PM IST
    Follow us on

    Acharya Movie: ఒక్క హీరో కి అభిమానులు మరియు దురాభిమానులు ఉండడం సర్వసాధారణం..చిరంజీవి మరియు బాలకృష్ణ శకం నడుస్తున్న సమయం లో సోషల్ మీడియా అంతగా ఉండేది కాదు కాబట్టి వాళ్ళ అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ మనం ప్రత్యక్షంగా చూడలేకపోయాము..కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెగా మరియు నందమూరి ఫాన్స్ మధ్య ఎలాంటి పోరు అప్పట్లో ఉండేదో అర్థం అయ్యేలా చేసింది..ఇక ఇటీవల విడుదల అయినా ఆచార్య సినిమా పై నందమూరి అభిమానులు సోషల్ మీడియా లో చేస్తున్న నెగటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటె చిరంజీవి పై ఎందుకు వీళ్ళకి అంత పగ అనేది ఆశ్చర్యానికి కలుగచేసే విషయం..వీళ్ళకి తోడుగా ఇతర హీరోల అభిమానులు కూడా చిరంజీవి పై సోషల్ మీడియా లో అంత భారీ ఎత్తున నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు..ఒక్కడి పరాజయాన్ని చూసి ఇంతమంది ఆనందపడుతున్నారు అంటే కచ్చితంగా అతను పెద్ద తోపే అయ్యి ఉండాలి.

    Acharya Movie

    ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చి, చిన్న చిన్న పాత్రల ద్వారా హీరో స్థాయికి ఎదిగి ఎన్నో హిట్లు , బ్లాక్ బస్టర్లు మరియు ఇండస్ట్రీ హిట్లు కొట్టి తెలుగు సినీ వినీలాకాసం లో ఎవ్వరికి అందనంత ఎత్తు ఎదిగిన చిరంజీవి అంటే ఇతర హీరోల అభిమానులకు అసూయ ఉండడం సహజమే..ఎందుకంటే ఎన్టీఆర్ కొడుకు , ANR కొడుకు మరియు రామానాయుడు గారి కొడుకు ఇంతమందిని దాటుకొని ఒక్క కానిస్టేబుల్ కొడుకు దశాబ్దాలు ఇండస్ట్రీ ని నెంబర్ 1 స్థానం లో కూర్చొని ఏలడం అంటే మాటలు కాదు కదా..తన తోటి హీరోలు అయినా బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ వంటి వారు ప్రస్తుతం స్టార్ స్టేటస్ కోల్పోయి, 30 కోట్ల రూపాయలకు పరిమితం అయినా ఈ రోజుల్లో , మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్ళ వయస్సుకు సమీపిస్తున్న కూడా 100 కోట్ల రూపాయిల మార్కెట్ హీరోల లిస్ట్ లో కొనసాగుతూ ఉంటె దురాభిమానుల కడుపు మంటే కదా.

    Acharya: తెలుగులో బిగ్గెస్ట్ ఫట్లు.. రూ. 80 కోట్ల నష్టాల్లో ‘ఆచార్య’

    అందుకే అతనికి పరాజయం వస్తే ఇంతమంది పండగలాగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు..ఇప్పుడు ఆచార్య సినిమా అందరూ ఫ్లాప్ అయ్యింది అని సంబరాలు చేసుకుంటున్నారు..అది పక్కన పెడితే ఆచార్య సినిమా మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 30 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది..ఈ 30 కోట్ల రూపాయిల వసూళ్లు నందమూరి బాలకృష్ణ తర్వాతి సినిమా మార్కెట్ రేంజ్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు అని మెగా అభిమానులు సోషల్ మీడియా లో కుండబద్దలు కొట్టి చెప్తున్నారు..ప్రస్తుతం ఇద్దరి మార్కెట్ మధ్య అంత వ్యత్యాసం ఉంది అనే చెప్పొచ్చు..ఆచార్య సినిమా ఫుల్ రన్ లో 70 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఈ వసూళ్లు నందమూరి బాలకృష్ణ రీసెంట్ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా అఖండ సినిమా ఫుల్ రన్ వసూళ్లతో సమానం..అంటే చిరంజీవి ఒక్క డిజాస్టర్ సినిమా వసూళ్లు బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ హిట్ వసూళ్లతో సమానం అని మెగా అభిమానులు నందమూరి అభిమానులకు సోషల్ మీడియా లో కౌంటర్ ఇస్తున్నారు..ఇలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో కాబట్టే చిరంజీవి మీద అంత పగ ఉంది అని మెగా అభిమానులు సోషల్ మీడియా లో నందమూరి అభిమానుల పై నిప్పులు చెరుగుతున్నారు.

    Also Read: Aacharya Chiranjeevi: ‘ఆచార్య’కు ఇంతటి అవమానమేల..?

    Tags