https://oktelugu.com/

Malla Reddy: మల్లారెడ్డి ఫ్లాష్ బ్యాక్.. ఫుల్లీ ఎమోషనల్

Malla Reddy: మంత్రి మల్లారెడ్డి సంపదకు.. ఆయన భాషకు అస్సలు తేడా ఉండదు. కోటీశ్వరుడు.. పైగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలతో దేశంలోనే టాప్ 10లో ఉండే ఆయన మాట్లాడితే మాత్రం పక్కా పల్లెటూరి నాటు మల్లన్న మాట్లాడినట్టే ఉంటుంది. అయితే మల్లారెడ్డి కూడా ఒకప్పుడు సామాన్యుడే. ఎంత సామాన్యుడు అంటే తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫ్లాష్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 1, 2022 / 05:30 PM IST
    Follow us on

    Malla Reddy: మంత్రి మల్లారెడ్డి సంపదకు.. ఆయన భాషకు అస్సలు తేడా ఉండదు. కోటీశ్వరుడు.. పైగా మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలతో దేశంలోనే టాప్ 10లో ఉండే ఆయన మాట్లాడితే మాత్రం పక్కా పల్లెటూరి నాటు మల్లన్న మాట్లాడినట్టే ఉంటుంది. అయితే మల్లారెడ్డి కూడా ఒకప్పుడు సామాన్యుడే. ఎంత సామాన్యుడు అంటే తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఫ్లాష్ బ్యాక్ ను తవ్వితీసి తన పాత జ్ఞాపకాలను.. మూలాలను పంచుకున్నారు.

    40 ఏళ్ల క్రితం తానొక సాదాసీదా వ్యక్తిని అని మల్లారెడ్డి ఎమోషనల్ అయ్యారు. బతుకు దెరువు కోసం పూలు, పాలు అమ్మానని తన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేసుకున్నారు. కానీ ఇప్పుడు నా కళాశాలలు దేశంలోనే టాప్ 10లో ఉన్నాయి. నా కష్టార్జితంతోనే ఇన్ని కళాశాలలు, సంస్థలు స్థాపించాను. మనం ఎంత కష్టపడితే అంత గొప్పవాళ్లమవుతాం. సండే, మండే అంటూ తేడా లేకుండా కష్టపడ్డాను కాబట్టే తాను ఈస్థాయిలో ఉన్నానని మల్లారెడ్డి భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారు.

    మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా కార్మిక దినోత్సవం నాడు ఆయన చేసిన ప్రసంగం మాత్రం ఆకట్టుకుంది. అందరినీ అలరించింది. ఎందుకంటే ఒక పూలు, పాలు అమ్మిన వ్యక్తి ఇప్పుడు కోట్లకు పడగలెత్తడం.. ఏకంగా ఒక రాష్ట్రానికి మంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు.. ఎన్ని ఆరోపణలున్నా కానీ ఇంతస్థాయికి ఎదగడం అంటే నిజంగానే గొప్ప అని చెప్పొచ్చు.

    మల్లారెడ్డి మంత్రిగా , కళాశాలల అధిపతిగా..  ఒక పారిశ్రామికవేత్తగా ఇలా విభిన్న రకాలుగా ఎదిగారు. ఆయన ఎదుగుదల వెనుక ఎంతో కష్టం దాగుందన్న విషయం తాజాగా బయటపడింది.
    Recommended Videos