Sankranthi Movies: తెలుగు వారి సంస్కృతిలో సంక్రాంతి ఒక భాగం కాగా సినిమాతో విడదీయరాని బంధం కలిగి ఉంది. పెద్ద పండగ మూడు రోజులు పల్లెలు జనాలతో నిండిపోతాయి. కుటుంబ సభ్యులు అందరూ ఒకచోట చేరుతారు. కొత్త బట్టలు, పిండి వంటలు, అలంకరించిన ఇళ్ళు వాకిళ్లు, కోడి పందాలు, ముగ్గులు పోటీలు… సంక్రాంతి పండగ శోభ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకు వెళ్లడం ఓ గొప్ప సరదా. సంక్రాంతి పండుగ దినాల్లో ఖచ్చితంగా సినిమా చూడడం అనవాయితీగా మారిపోయింది. అలాగే సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. సంక్రాంతి సినిమాలు మనకు ఎన్నో తియ్యని జ్ఞాపకాలు మిగుల్చుతాయి. వాటిని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒకప్పటి స్మృతులు గొప్ప అనుభూతిని పంచుతాయి. మరి 2000 సంవత్సరం నుండి 2021 వరకు రెండు దశాబ్దాల్లో సంక్రాంతికి విడుదలైన సినిమాలు గుర్తు చేసుకుందాం. ఈ సినిమాల్లో మీరు ఎన్ని, ఎక్కడ, ఎవరితో చూశారో గుర్తు చేసుకోండి..
2000
అన్నయ్య
వంశోద్ధారకుడు
పోస్ట్ మాన్
కలిసుందాం రా
సమ్మక్క-సారక్క
2001
నరసింహనాయుడు
మృగరాజు
దేవీ పుత్రుడు
2002
సీమ సింహం
టక్కరి దొంగ
నువ్వులేక నేను
2003
నాగ
ఎవరే అతగాడు
ఈ అబ్బాయి చాలా మంచోడు
ఒక్కడు
పెళ్ళాం ఊరెళితే
2004
లక్ష్మీ నరసింహ
అంజి
వర్షం
2005
బాలు
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
అల్లుడు
ధన 51
2006
దేవదాసు
స్టైల్
చుక్కల్లో చంద్రుడు
లక్ష్మీ
2007
దేశముదురు
యోగి
2008
కృష్ణ
ఒక్క మగాడు
పౌరుడు
2009
మస్కా
అరుంధతి
2010
ఓం శాంతి
అదుర్స్
నమో వెంకటేశా
శంభో శివ శంభో
2011
పరమ వీర చక్ర
మిరపకాయ్
అనగనగా ఓ ధీరుడు
గోల్కొండ హైస్కూల్
2012
బిజినెస్ మాన్
బాడీ గార్డ్
నందీశ్వరుడు
2013
నాయక్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
2014
నేనొక్కడినే
ఎవడు
2015
గోపాల గోపాల
2016
నాన్నకు ప్రేమతో
ఎక్స్ ప్రెస్ రాజా
డిక్టేటర్
సోగ్గాడే చిన్నినాయనా
2017
ఖైదీ నంబర్ 150
గౌతమీ పుత్ర శాతకర్ణి
హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య
శతమానం భవతి
2018
అజ్ఞాతవాసి
జైసింహ
రంగులరాట్నం
2019
ఎన్టీఆర్ కథానాయకుడు
వినయ విధేయ రామ
ఎఫ్ 2
2020
సరిలేరు నీకెవ్వరు
అల వైకుంఠపురంలో
ఎంత మంచివాడవురా
2021
క్రాక్
రెడ్ అల్లుడు అదుర్స్
2022
బంగార్రాజు
రౌడీ బాయ్స్
సూపర్ మచ్చి
హీరో
జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ సంక్రాంతి సినిమాలు మనకు గొప్ప అనుభూతిని పంచాయి. మిత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి అందించిన క్షణాలు జ్జ్ఞాపకాల బ్యాంకులో పదిలం చేశాయి.
Also Read: ఈ పోస్టాఫీస్ స్కీమ్ తో ప్రతి నెలా రూ.550 పొందవచ్చు.. ఎలా అంటే?