Puneeth Raj Kumar Last Film Fre Release Event: కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆయన నటించిన చివరి చిత్రం కావడంతో ఫ్యాన్స్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 6న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. ఈ వేడుకకు చిరంజీవి, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిసింది.

త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. మరి ఒకే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి హాజరు కావడం నిజంగా విశేషమే. తారక్, పునీత్ మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. పునీత్, తారక్ ను సొంత తమ్ముడిలా ఫీల్ అయ్యేవాడు. అందుకే, పునీత్ చక్రవ్యూహ సినిమా కోసం తారక్ పాట కూడా పాడాడు.
Also Read: భీమ్లానాయక్‌ను ఎన్ని రోజుల్లో పూర్తి చేశారో తెలిస్తే షాక్ అవుతారంతే..!
అన్నట్టు జేమ్స్ సినిమా మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం పునీత్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. నాతో పోటీకొచ్చిన వాళ్లెవరూ గెలిచిన రికార్డే లేదని విలన్ అంటే.. నాకు మొదటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేయడమే తెలుసు అన్న పునీత్ డైలాగ్ చాలా బాగా ఆకట్టుకుంటుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియా ఆనంద్, ముఖ్య పాత్రలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. మొత్తానికి ఈ టీజర్ చాలా బాగుంది. సినిమా పై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక పునీత్ చివరి చిత్రం కావడంతో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. పైగా ఈ సినిమా తో అన్నీ రికార్డ్స్ బ్రేక్ అయ్యేలా పునీత్ ఫ్యాన్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ముఖ్యంగా తమ దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం అంటూ ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
Also Read: “భీమ్లా నాయక్”కి నేను పిల్లర్ ఐతే, ఆయన సిమెంట్ – థమన్