https://oktelugu.com/

కరోనా టైంలో ‘క్రాక్’ చూపిస్తున్న మాస్ మహారాజ్..!

కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగు, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే.. ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చారు. దీంతో టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగులు చేసేందుకు దర్శక, నిర్మాతలు సిద్ధమవుతున్నారు. Also Read: క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న రాశి ! ఇటీవలే దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ప్రారంభించారు. కరోనా అనంతరం యాక్షన్.. కెమెరా.. స్టాట్ అంటూ ఓ వీడియోతీసి […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 / 01:42 PM IST
    Follow us on

    కరోనా ఎఫెక్ట్.. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగు, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే.. ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతి ఇచ్చారు. దీంతో టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగులు చేసేందుకు దర్శక, నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

    Also Read: క్లీవేజ్ షోతో రెచ్చగొడుతున్న రాశి !

    ఇటీవలే దర్శక దిగ్గజం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ ప్రారంభించారు. కరోనా అనంతరం యాక్షన్.. కెమెరా.. స్టాట్ అంటూ ఓ వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టుచేసి అభిమానుల్లో జోష్ నింపారు. తాజాగా మాస్ మహారాజ్ రవితేజ సైతం తన ‘క్రాక్’ చూపించేందుకు చూపించి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.

    మాస్ మహారాజ్ రవితేజ తాజా చిత్రం ‘క్రాక్’. ఈ సినిమా చేస్తుండగానే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో షూటింగ్ నిలిచిపోయింది. ఆరేడు నెలల గ్యాప్ తర్వాత ‘క్రాక్’ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

    Also Read: రాజమౌళి పై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఫిర్యాదులు !

    కరోనా నిబంధనలు పాటిస్తూ సినిమా షూటింగ్ ఎలా ప్రారంభమయిందనేది దర్శకుడు మలినేని గోపిచంద్ ఓ మేకింగ్ వీడియో తీశాడు. యూనిట్‌ సభ్యులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడం.. నటినటులంతా మాస్కులు ధరించడం.. శానిటైజర్స్‌ ఉపయోగించడం చూపించారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించబోతున్నాడు. ‘క్రాక్’ మూవీని ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నాడు.