https://oktelugu.com/

Maruthi Car Discounts: మారుతి కార్లా? మజాకా? ఇంత తగ్గింపు ఉంటుందని ఊహించలేరు..

మారుతి నుంచి కాంపాక్ట్ ఎస్ యూవీ డిజైర్ పై కూడా తగ్గింపును ప్రకటించారు. ఇది ఆటోమేటిక్ వెర్షన్ పై రూ.30,00, మాన్యువల్ వెర్షన్ పూ రూ.25 వేల తగ్గింపును ప్రకటించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 9, 2024 / 11:22 AM IST

    Maruthi no safety cars

    Follow us on

    Maruthi Car Discounts: మారుతి కార్లు అనగానే కొంత మంది బాగా లైక్ చేస్తారు. ఈ కార్లు అందించే ఫీచర్స్, డిజైన్ తో పాటు లో బడ్జెట్ లో అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా కొన్ని సందర్భంగా బంపర్ ఆఫర్స్ ఇస్తుంటాయి. మారుతికి సంబంధించిన స్విప్ట్ నెక్ట్స్ జనరేషన్ మే 9న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దీని రిలీజ్ కు ముందే కంపెనీకి చెందిన కొన్ని కార్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటించింది. ఇవి ప్రముఖ కార్లు అయినా వినియోగదారులకు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ఆఫర్లు ప్రకటించింది. లేటేస్గుగా ఏ కార్లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూద్దాం..

    మారతి నుంచి రిలీజ్ అయిన చాలా కార్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. వీటిలో స్విప్ట్ ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ మోడల్ కొన్నేళ్లుగా అత్యధిక సేల్స్ ను నమోదు చేసుకుంటోంది. ఈ మోడల్ ప్రస్తుతం రూ.6.24 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 9.14 లక్షల వరకు విక్రయిస్తున్నారు. దీనిపై లేటేస్టుగా పెట్రోల్వ వేరియంట్ పై రూ.38,000, సీఎన్ జీ వెర్షన్ పై రూ.18,100 డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

    మారుతి నుంచి ది బెస్ట్ కారు ‘ఆల్టో కే 10’ కూడా పేర్కొన వచ్చు. సామాన్యుల నుంచి ధనిక వర్గాల వరకు వారి అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తున్నారు. ఆల్టో కే 10 ప్రస్తుతం మార్కెట్లో రూ.3.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. పెట్రోల్ తో పాటు సీఎన్ జీ వేరియంట్ లో ఉన్న ఈ మోడల్ పై పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ రూ.50,100, ఆటోమేటిక్ వేరియంట్ పై రూ.55,100, సీఎన్ జీ వేరియంట్ పై రూ.43,100 తగ్గింపును ప్రకటించారు.

    మారుతి నుంచి కాంపాక్ట్ ఎస్ యూవీ డిజైర్ పై కూడా తగ్గింపును ప్రకటించారు. ఇది ఆటోమేటిక్ వెర్షన్ పై రూ.30,00, మాన్యువల్ వెర్షన్ పూ రూ.25 వేల తగ్గింపును ప్రకటించారు. ప్రస్తుతం మార్కెట్లో డిజైర్ ధర రూ.6.57 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెంది స్ ప్రెస్సో భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయొచ్చు. దీని మాన్యువల్ వేరియంట్ పై రూ.50,100, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ పై రూ.55,100 డిస్కౌంట్ ను అందించనున్నారు. ప్రస్తుం మారుతి ఎస్ ప్రెస్సో రూ.4.26 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.6.11 లక్షల వరకు విక్రయిస్తున్నారు. అయితే ఈ ఆపర్లు మే 31 వరకే ఉంటాయని తెలిపింది. ఆ లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రే ఇవి వర్తిస్తాయిని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.